AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: తెలంగాణకు మరోసారి భారీ వర్షసూచన.. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు..

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు (సెప్టెంబర్ 14న) పలు జిల్లాల్లో భారీ నుంచి

Rain Alert: తెలంగాణకు మరోసారి భారీ వర్షసూచన.. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు..
Rain Alert
Rajitha Chanti
|

Updated on: Sep 14, 2021 | 8:14 AM

Share

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు (సెప్టెంబర్ 14న) పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని తెలిపింది. ఈ వాయుగుండం సోమవారం ఉదయం ఉత్తర కోస్తా… ఒడిశా వద్ద చాంద్‏బలీకి పశ్చిమ వాయువ్య దిశగా 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు తెలిపింది.

రాగల 24 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ మీదుగా ప్రయాణించి.. 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్టు వివరించింది. ఇక రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నట్టుగా పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. ఇక ఈరోజు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక నిన్న హైదరాబాద్‏లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్‌లో వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ఇక నిన్న కురిసిన వర్షానికి మరోసారి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Also Read: Bigg Boss 5 Telugu: ఇక్కడ దగడ్ లోబో.. ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన కంటెస్టెంట్.. సపోర్ట్ చేస్తే నామం పెడుతున్నారంటూ..

Bigg Boss 5 Telugu: వారిద్దరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు.. ఆ కంటెస్టెంట్స్‏పై శ్వేత ఉగ్రరూపం..

Bigg Bigg 5 Telugu: వామ్మో.. ఇదేక్కడి గోల రా బాబు.. నామినేట్ చేయమంటే నోటికి పని చెప్పారు… బూతులతో రెచ్చిపోయిన కంటెస్టెంట్..

Bigg Boss 5 Telugu 2nd week nomination list: ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు కంటెస్టెంట్లు.. హౌస్ నుంచి వెళ్లేది ఆమేనా..?