Sai Dharam Tej Accident: హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఎఫెక్ట్.. కన్‌స్ట్రక్షన్ కంపెనీపై భారీ జరిమానా..
GHMC Reaction: మెగా హీరో సాయిధరమ్ తేజ్ రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగం కాగా.. రోడ్డుపై కన్‌స్ట్రక్షన్ కంపెనీకి..
Sai Dharam Tej Accident: మెగా హీరో సాయిధరమ్ తేజ్ రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగం కాగా.. రోడ్డుపై కన్‌స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన ఇసుక మట్టి ఉండటం మరో కారణం. రోడ్డుపై సదరు కన్‌స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి మట్టి, వ్యర్థాలు ఉండటం వల్లే తేజ్ బైక్ స్కిడ్ అయి పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన కన్‌స్ట్రక్షన్ కంపెనీపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెళ్లుతెత్తాయి. అయితే, ఈ సంఘటనతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. నగర వ్యాప్తంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కన్‌స్ట్రక్షన్ కంపెనీలపై ఓ కన్నేసింది. ఇందులో భాగంగానే ఖానమేట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్‌స్ట్రక్షన్ కంపెనీపై భారీ జరిమానా విధించింది జీహెచ్ఎంసీ. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా రోడ్డుపై ఇసుక వ్యర్థాలను ఉంచినందున హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 ప్రకారం 674 హెచ్ఎంసీ ఆక్ట్ వర్తింపజేస్తూ లక్ష రూపాయల జరిమానా విధించారు. అయితే, హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి, ఇప్పుడు ఫైన్ విధించిన కన్‌స్ట్రక్షన్ కంపెనీతో ఎటువంటి సంబంధం లేదని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఎన్. సుధాంశు తెలిపారు.
ఈనెల 10వ తేదీన హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో హీరో సాయిధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హై స్పీడ్‌లో వెళ్తుండగా.. రోడ్డుపై ఉన్న ఇసుక మట్టి కారణంగా బైక్ స్కిడ్ అవడంతో సాయిధరమ్ తేజ్ కిందపడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తేజ్.. ఘటనా స్థలంలోనే అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే.. అతన్ని మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేజ్.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు సైతం కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని నిర్ధారించారు.
Business Plan: భారతీయ రైల్వేలో వ్యాపారం.. తక్కువ పెట్టుబడితో అదిరిపోయే సంపాదన.. ఎలా చేయాలంటే..