వడగాలులు.. తెలంగాణలో ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..!

దేశవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోహిణి కార్తెలో సూర్యుడి మంటలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారిపోయాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 8:56 am, Fri, 29 May 20
వడగాలులు.. తెలంగాణలో ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..!

దేశవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోహిణి కార్తెలో సూర్యుడి మంటలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారిపోయాయి. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే మూడు డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు ఇవాళ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం వేళ అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, అయితే ఎండల తీవ్రత వలన పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read This Story Also: షాకింగ్ న్యూస్.. వ్యాక్సిన్ వచ్చినా కరోనా పోదట..!