AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కరోజే 117 మందికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో కరోనా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా కారణంగా తెలంగాణలో కొత్తగా 117 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,256కు చేరింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకు మృత్యువాత పడిన వారి సంఖ్య 67కు చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 1,345 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో […]

ఒక్కరోజే 117 మందికి కరోనా పాజిటివ్‌
Sanjay Kasula
|

Updated on: May 29, 2020 | 8:26 AM

Share

తెలంగాణలో కరోనా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా కారణంగా తెలంగాణలో కొత్తగా 117 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,256కు చేరింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకు మృత్యువాత పడిన వారి సంఖ్య 67కు చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 1,345 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 844 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

తెలంగాణను సౌదీ విమానం భయపెట్టిస్తోంది. దుబాయ్‌ నుంచి వచ్చిన వారిలోనే కరోనా కేసులు బయటపడుతున్నాయి.10 రోజుల కిందట సౌదీ నుంచి 458 మంది ప్రయాణికులు వచ్చారు.458 మందిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల వాసులే ఉన్నారు. సౌదీ నుంచి వచ్చిన వారిలో అత్యధికంగా కరోనా పాజిటీవ్‌ కేసులు బయటపడుతున్నాయి. దీంతో సౌదీ నుంచి వచ్చిన వారందరిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ప్రతిరోజు కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. 458 మందిలో ఇప్పటి వరకు 143 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Follow Us