7 నుంచి హైదరాబాద్ మెట్రో సర్వీసులు.. మార్గదర్శకాలివే

ఈ నెల ఏడో తేదీ నుంచి హైదరాబాద్‌ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు కాస్త తగ్గనున్నాయి. కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో

7 నుంచి హైదరాబాద్ మెట్రో సర్వీసులు.. మార్గదర్శకాలివే
Follow us

| Edited By:

Updated on: Sep 03, 2020 | 8:34 PM

Hyderabad Metro News: ఈ నెల ఏడో తేదీ నుంచి హైదరాబాద్‌ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు కాస్త తగ్గనున్నాయి. కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో‌ మెట్రో రైళ్లు పట్టాలెక్కనుంది. ఇక కరోనా నేపథ్యంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఎల్‌ అండ్‌ టీ, మెట్రో అధికారులతో సమావేశం నిర్వహించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇక ఈ నెల 7 నుంచి మూడు ఫేజ్‌లుగా మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 7న  మియపూర్ నుంచి ఎల్బీనగర్.. 8వ తేదీన నాగోల్‌ నుంచి రాయదుర్గం.. 9న అన్ని మార్గాల్లో మెట్రో సర్వీసులు తిరగనున్నాయి.  ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు తిరిగి 4 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే మెట్రోలు తిరగనున్నాయి. అలాగే కంటైన్మెంట్ జోన్లలో మెట్రో క్లోజ్ అవ్వనుంది.

మార్గదర్శకాలివే..

1.ప్రయాణికుల ట్రాఫిక్‌ని బట్టి మెట్రో ట్రైన్ అందుబాటులో ఉండనుంది.

2. భౌతిక దూరం విషయంలో మార్కింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాము. సీటు, సీటుకు మధ్యలో మార్కింగ్ ఉంటుంది.

3.భౌతిక దూరం విషయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండేలా సీసీ కెమెరా మానిటరింగ్ చేయనుంది.

4.మాస్క్ లేకపోతే మెట్రోలోకి నో ఎంట్రీ ,మాస్క్ లేకుండా ప్రయాణం చేస్తే వారికి పెనాల్టీ విధించనున్నారు.

5.థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాత కరోనా లక్షణాలు లేవు అనుకుంటేనే లోపలికి ఎంట్రీ.

6.ప్రతి ఎంట్రీ దగ్గర కూడా శానిటేషన్ చేసుకునే విధంగా ఏర్పాటు.

7. మెట్రో ఉద్యోగులు అందరూ పీపీఈ కిట్‌లు ధరించాలి.

8.స్మార్ట్ కార్డ్, మొబైల్ QR టికెటింగ్, కాష్ లెస్ లావాదేవీలకు మాత్రమే అవకాశం ఉంటుంది.

9.ప్రయాణికులకు మినిమం లగేజీ మాత్రమే అనుమతి, మెటలిక్ వస్తువులకు అనుమతి లేదు.

10. అన్ని పార్కింగ్ ప్లేస్‌లు ఓపెన్‌లో ఉంటాయి. గైడెలెన్స్‌ ప్రకారం నడుచుకోవాలి.

11. అన్ని పోలీస్‌, మెడికల్ డిపార్ట్‌మెంట్‌ల సమన్వయంతో మెట్రో నడనుంది.