GHMC water bills: గ్రేటర్ వాసులకు వాటర్ కష్టాలు.. భాగ్యనగరవాసుల దక్కని ఫ్రీ ఫలం.. ఐదింతల బిల్లుతో హడలిపోతున్న జనం

గ్రేటర్ హైదరాబాద్‌లో వాటర్ బోర్డ్ నుండి 6నెలల తర్వాత ఒక్కసారిగా వచ్చిన నీటి బిల్లులు చూసి హైదరాబాద్ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు..

GHMC water bills: గ్రేటర్ వాసులకు వాటర్ కష్టాలు.. భాగ్యనగరవాసుల దక్కని ఫ్రీ ఫలం.. ఐదింతల బిల్లుతో హడలిపోతున్న జనం
Ghmc Free Water Scheme
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 22, 2021 | 2:50 PM

GHMC water bills problems: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. భాగ్యనగర వాసులకు 20వేల లీటర్ల ఉచిత నీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు గ్రేటర్ హైదరాబాద్ జలమండలి అమలు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, వాస్తవ పరిస్థితులు జనం జేబుకు చిల్లు పెడుతున్నాయి. అంతన్నారు ఇంతన్నారు చివరికి మీరే కట్టాలి అని బారెడు బిల్లులు ఇప్పుడు చేతిలో పెడుతున్నారని వాపోతున్నారు ప్రజలు. గ్రేటర్ హైదరాబాద్‌లో వాటర్ బోర్డ్ నుండి 6నెలల తర్వాత ఒక్కసారిగా వచ్చిన నీటి బిల్లులు చూసి హైదరాబాద్ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు..

గ్రేటర్‌లో 12 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. వీరందరికీ 20వేల లీటర్ల వరకు ఉచితంగా అందిస్తామని వాటర్ వర్క్స్ అధికారులు తెలిపారు. అయితే, ప్రతిఒక్కరూ ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని సూచించారు. అయితే, ఆన్‌లైన్ ద్వారా లింక్ చేసుకోని వారికి బిల్లు ఇస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఉచితంగా నీటి అందిస్తుంటే బిల్లు వసూలు చేయడం ఏంటి భాగ్యనగరవాసులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు, నల్లా కనెక్షన్‌ క్యాన్‌ నెంబర్‌కు ఆధార్‌ అనుసంధానం చేసి, నల్లాలకు మీటర్‌ బిగించుకున్నా బిల్లుల మోత మోగుతోంది. నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం ద్వారా జీరో బిల్లులు వస్తాయని ఆశించినవారికి వేలకు వేలు నీటి బిల్లు వస్తోంది. సకాలంలో చెల్లించకపోతే మరుసటి నెల నుంచే బిల్లులపై జరిమానా, వడ్డీలు కూడా విధిస్తామని బోర్డు హెచ్చరిస్తోంది. సాధారణంగా ఏ నెల బిల్లును ఆ నెల సరాసరి ప్రకారం నిర్ణయించాల్సి ఉండగా, ఐదు నెలల యూనిట్‌ చార్జీలన్నింటినీ ఒకేసారి లెక్కిస్తున్నారు. దీంతో కిలో లీటర్‌కు విధించాల్సిన చార్జి కంటే అదనపు భారం వినియోగదారులపై పడుతోంది. లాక్‌డౌన్‌తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ బిల్లులు మరింత భారంగా మారుతున్నాయి. ఉచిత తాగునీటి పథకంలో భాగంగా గృహ కనెక్షన్‌దారులు తమ క్యాన్‌ నెంబర్‌కు ఆధార్‌ అనుసంధానం చేసుకొని, నల్లా కనెక్షన్‌కు మీటర్‌ బిగించుకునేందుకు ఏప్రిల్‌ 30 వరకు బోర్డు గడువు ఇచ్చింది. ఆ సమయంలో నీటి బిల్లులు జారీ చేయలేదు. పథకం లబ్ధి పొందేందుకు ఇచ్చిన గడువు పూర్తయింది. దీంతో మీటర్‌ రీడర్లు కరోనాతో ఇంటింటికీ తిరగకుండా, ఆధార్‌ అనుసంధానం అయిందా లేదా పరిశీలించకుండా గంపగుత్తగా బిల్లులు జారీ చేస్తున్నారు.

సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి నీటి బిల్లు వచ్చింది. గత డిసెంబర్ లో 200 కట్టామని ఇప్పుడు 6 నెలల అయ్యాక 1500 బిల్లు వేసి.. ఒకేసారి కట్టాలని వాటర్ వర్క్స్ సిబ్బంది చేతిలో పెట్టారు. అసలు మంచి నీరు ఉచితంగా ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన నేతల మాటలు ఎటు పోయాయని సదరు వినియోగదారుడు నిలదీస్తున్నాడు. మంచి నీరు రాని మా ప్రాంతంలో డబ్బులు ఖర్చు పెట్టి నీటి ట్యాంకర్లు తెప్పించుకుంటున్నాం అని, మళ్లీ మంచి నీరు పేరుతో నల్లా కనెక్షన్ ఉన్న కారణంగా ఇంతలా బిల్లలు ఎందుకు అని ప్రశ్నింస్తున్నారు.

ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేదు..హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పుడు నీటి బిల్లులపై అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు ప్రజలు. అసలు ఉచిత నీరూ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒకేసారి ఇంత బిల్ వేశారని, నీటి కనెక్షన్ కి ఆధార్ అనుసంధానం అంటూ మరొక మెలిక పెట్టారని మండిపడుతున్నారు. ఇవ్వదలుచుకున్న 20 వేల ఉచిత నీరు ఇచ్చాక బిల్లు గురించి అడగండి అంటున్నారు జనం. వాటర్ బోర్డ్ అధికారుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మీటర్లు పనిచేయకపోతే అది కూడా నివాసం ఉంటున్న వారిదే బాద్యత అంటున్నారని, కనీసం అందులో సాంకేతిక సమస్య వస్తే పట్టించుకోవట్లేదు అంటూన్నారు.

వాస్తవానికి నీటి మీటర్లు ఆధార్ తో అనుసంధానం చేయాలి అంటే పెద్ద టాస్క్.. ఢిల్లీ లాంటి మహానగరాల్లో అది 5 ఏళ్లు పట్టింది అని, హైదరాబాద్ లాంటి పెద్ద నగరంలో 4నెలల ముందు చెప్పి అది కాకపోతే ఆ భారం ప్రజల మీద ఎలా వేస్తారని ప్రశ్నించారు హైదరాబాద్ రెసిడెన్స్ ఫోరమ్ ప్రతినిధులు. నీటి మిటర్లకి ఆధార్ అనుసంధానంలో అధికారులు మూడు అడుగులు ముందుకి ఆరడుగుల వెనక్కి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరో వైపు, హైదరాబాద్ లో ఉన్న పూర్తి జనాభాలో సగానికిపైగా అద్దె కి ఉంటున్న వారు అనేకం. ఇంటి అసలు ఓనర్స్ బయటి దేశాల్లో ఉంటూ, ఇల్లు ఒకరి పేరుపై ఉండి నివాసం ఉంటున్న వారు మరి కొంత మంది. ఇక, కొంత మంది మీటర్లు పెట్టుకున్న అవి పనిచేయట్లేదు. ఇలా అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయి.. వీటన్నింటినీ అధికారులు ఎలా పరిష్కరిస్తారు అనేది ఇప్పుడు అసలు టాస్క్.

అయితే, ఉచిత తాగునీటి పథకంలో చేరేందుకు ఏప్రిల్‌ 30 వరకు వాటర్‌బోర్డు గడువు ఇచ్చింది. సుమారు నాలుగు లక్షల మంది తమ ఆధార్‌ కార్డును అనుసంధానం చేసుకున్నారు. రెండు లక్షలకు పైగా మీటర్లకు బిగించుకున్నారు. వారికి డిసెంబర్‌ నెల నుంచి నెలకు 20 వేల లీటర్ల చొప్పున ఉచితం వర్తిస్తుందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం కూడా ఉచిత తాగునీటి పథకంలో చేరవచ్చని, క్యాన్‌ నెంబర్‌కు ఆధార్‌ అనుసంధానం, నల్లాకు మీటర్‌ బిగింపు చేసుకుంటే ఈ పథకం వర్తిస్తుందని వాటర్‌బోర్డు అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్‌ నెల నుంచి గడిచిన ఐదు నెలలకు బిల్లు యథావిధిగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.

ఇదిలావుంటే, కరోనా తో అనేకమంది ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోయి ఉంటే నిత్యావసరం నుండి సమస్తం డబ్బుల బాదుడు ఉంటే సాధారణ ప్రజలు బతికేదెలా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు మాత్రం ఇప్పుడు స్పందించట్లేదు.

Read Also….  Covid-19 Third Wave: దేశంలో థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది? తాజా అధ్యయనం పూర్తి వివరాలు

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్