AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lover Suicide: పెళ్లిప్పుడే వద్దన్న ప్రేయసి.. ఆవేశంతో నాలుగో అంతస్తు నుంచి దూకి ప్రేమికుడు ఆత్మహత్య

ఒకరినొకరు మనసుపడ్డారు. ఇష్టంగా కలిసి తిరిగారు. తీరా పెళ్లి వరకు వచ్చేసరికి ప్రేయసి వాయిదా వేసింది. దీంతో ప్రియుడు క్షణికావేశంలో బిల్డింగ్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Lover Suicide: పెళ్లిప్పుడే వద్దన్న ప్రేయసి.. ఆవేశంతో నాలుగో అంతస్తు నుంచి దూకి ప్రేమికుడు ఆత్మహత్య
Suicide
Balaraju Goud
|

Updated on: Jun 22, 2021 | 7:58 AM

Share

Hyderabad Young Man Ends Life: ఒకరినొకరు మనసుపడ్డారు. ఇష్టంగా కలిసి తిరిగారు. తీరా పెళ్లి వరకు వచ్చేసరికి ప్రేయసి వాయిదా వేసింది. దీంతో ప్రియుడు క్షణికావేశంలో బిల్డింగ్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగర శివారులోని బాలానగర్‌లో చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట రెయిన్‌బోవిస్టాస్‌లో నివాసముంటున్న కె.శుభమ్‌ (27) అమెజాన్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా బాలానగర్‌ శోభనకాలనీ రోడ్డు నంబర్‌-1లో ఉంటున్న యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటంతో కుటుంబసభ్యులు కూడా పెళ్లికి అంగీకరించారు. అయితే, పెళ్లికి శుభమ్‌ తొందరపెడుతండటంతో ముందు తన అక్కకు పెళ్లి కావాల్సి ఉందని సదరు యువతి వాయిదా వేస్తూ వస్తోంది.

ఇదే క్రమంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో శుభమ్‌ మరోసారి ఆమె ఇంటికెళ్లి పెళ్లి గురించి మాట్లాడాడు. అక్క పెళ్లి కాకుండా తాను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పడంతో ఆవేశంలో భవనం నాలుగో అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి కిషన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

Read Also…

Thieves Drill Whole Bank: దేశ రాజధాని ఢిల్లీలో భారీ దోపిడీ.. గోడను తవ్వి బ్యాంకుకు కన్నం.. లబోదిబోమంటున్న ఖాతాదారులు!

Woman forced to convert: మరోసారి వెలుగులోకి మతమార్పిడి.. ప్రేమ‌ పేరుతో మోసం.. నిఖా ఏర్పాటుతో అసలు నిజం..!

సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..