Woman forced to convert: మరోసారి వెలుగులోకి మతమార్పిడి.. ప్రేమ‌ పేరుతో మోసం.. నిఖా ఏర్పాటుతో అసలు నిజం..!

ప్రేమ‌ పేరుతో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఒక మ‌హిళ‌ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకోవాలంటే ఆమెను మ‌తం మారాలని బలవంతం చేశాడు.

Woman forced to convert: మరోసారి వెలుగులోకి మతమార్పిడి.. ప్రేమ‌ పేరుతో మోసం.. నిఖా ఏర్పాటుతో అసలు నిజం..!
Arrest
Follow us

|

Updated on: Jun 22, 2021 | 6:52 AM

Woman forced to convert: ప్రేమ‌ పేరుతో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఒక మ‌హిళ‌ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకోవాలంటే ఆమెను మ‌తం మారాలని బలవంతం చేశాడు. అతని వేధింపులు భరించలేని యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన గుజ‌రాత్‌లోని వ‌డ‌దోరలో చోటుచేసుకుంది.

వ‌డోద‌ర‌కు చెందిన 26 ఏళ్ళ స‌మీర్ ఖురేషీ 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యువతిని పరిచయం చేసుకున్నాడు. త‌న‌పేరు శ్యామ్ మార్టిన్ అని, తాను క్రిస్టియ‌న్ అని సమీర్ చెప్పాడు. ఈ విష‌యాన్ని నమ్మిన బాధితురాలు స‌మీర్ ఖురేషీతో ప‌రిచ‌యం పెంచుకుంది. ఈ ప‌రిచ‌యాన్ని ఆస‌ర‌గా చేసుకున్న స‌మీర్ బాధితురాలిని ఒక హోటల్‌కు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఇద్దరూ స‌న్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు చూపి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ, పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో రెండుసార్లు బాధితురాలు గ‌ర్భం దాల్చగా, నిందితుడు అబార్షన్ సైతం చేయించాడు. ఈ విషయంపై సదరు యువతి ఫిర్యాదు చేసినట్లు వ‌డ‌దోద‌ర జోన్ 2 పోలీసు డిప్యూటీ క‌మిష‌న‌ర్ జ‌య‌రాజ్‌సిన్హా వాలా వెల్లడించారు.

ఇలా ప్రేమ‌, పెళ్లి పేరుతో బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడుల‌ను నిరోధించ‌డానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం గుజ‌రాత్ ఫ్రీడ‌మ్ రిలీజియ‌స్ (అమెండ్‌మెంట్‌) యాక్ట్ 2021 చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చింది.పెళ్లి పేరుతో బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడికి పాల్పడినా, మ‌త‌మార్పడి కోసం వివాహం చేసుకున్నా, మ‌త‌మార్పిడి కోసం పెళ్లి చేసుకునేందుకు సాయం చేసినా ఈ చ‌ట్టం కింద మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రెండుల‌క్షల రూపాయల జ‌రిమానా విధిస్తారు. అదే బాధితురాలు మైన‌ర్ లేదా మ‌హిళ‌గానీ, ద‌ళితులు, గిరిజ‌నులు అయితే ఈ జైలు శిక్ష నాలుగేళ్ల నుంచి ఏడేళ్ల దాకా ఉంటుంది. దీంతోపాటు మూడు ల‌క్షల రూపాయ‌ల జ‌రిమానా కూడా విధిస్తారు. ఈ నేప‌థ్యంలో ఓ బాధితురాలు త‌న‌ను బ‌ల‌వంతంగా మ‌త‌ం మార్పించేందుకు స‌మీర్ ఖురేషీ ప్రయ‌త్నించాడ‌ని పోలీసుల‌ను ఆశ్రయించింది. ఈ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చాక, రాష్ట్రంలో న‌మోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.

అంతకు ముందు పెళ్లి చేసుకుంటానని బాధితురాలిని సమీర్ నమ్మించాడని పోలీసులు తెలిపారు. క్రైస్తవ సంప్రదాయంలో కాకుండా, నిఖా ఏర్పాటు చేయ‌డంతో నిందితుడి అస‌లు స్వరూపాన్ని ఆమె తెలుసుకోగ‌లిగింద‌ని పోలీసులు తెలిపారు. పెళ్లి త‌రువాత సమీర్ బాధితురాలి పేరు మార్చడ‌మే కాకుండా, ఆమెను మ‌తం మారాల్సిందిగా బ‌ల‌వంతం చేశాడ‌ని పోలీసులు చెప్పారు. ఈ విషయంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు స‌మీర్ ఖురేషీని పోలీసులు అరెస్ట్‌చేసి కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read Also… Dog Murder: రూ. ఆరు లక్షల కుక్క దారుణ హత్య.. రంగంలోకి దిగిన పోలీసులు.. అసలేమైందంటే..?