Twins: నెల్లూరు జిల్లాలో విషాదం.. కవల పిల్లల అనుమానాస్పద మృతి.. తల్లిదండ్రులపై అనుమానం..
Twins dead: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మనుబోలు మండలం రాజోలు గ్రామంలో పది నెలల వయస్సు ఉన్న ఇద్దరు కవల పిల్లలు
Twins dead: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మనుబోలు మండలం రాజోలు గ్రామంలో పది నెలల వయస్సు ఉన్న ఇద్దరు కవల పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన మిస్టరీగా మారింది. నిన్న సాయంత్రం పాలు తాగిన వెంటనే కవల పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారులను పరీక్షించిన నెల్లూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
కాగా.. వెంకటరత్నమ్మ , రమణయ్య దంపతుల మధ్య గతకొన్ని రోజులుగా తీవ్ర మనస్పర్థలు నెలకొన్నాయి. ఇటీవల పోలీసులు ఈ దంపతులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో పిల్లల మృతిపై తల్లీదండ్రుల పాత్ర ఉందేమోనన్న అనుమానంతో బంధువులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దంపతులిద్దరిని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో మరిన్ని విషయాలు రాబడతామని పోలీసులు పేర్కొన్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది. పిల్లలకు తాగించిన పాల బాటిల్, అనుమానాస్పద పదార్ధాలను సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Also Read: