దారుణం.. కుటుంబంలో ఐదుగురిని చంపి.. ఆపై వ్యక్తి ఆత్మహత్య.. రక్తపు మడుగులో మృతదేహాలు..

Maharashtra: మ‌హారాష్ట్ర‌లో దారుణం చోటుచేసుకుంది. నాగ్‌పూర్ సిటీలో ఓ వ్య‌క్తి కిరాతకంగా వ్యవహరించాడు. త‌న ఇంట్లో భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను, అత్త‌గారింట్లో

దారుణం.. కుటుంబంలో ఐదుగురిని చంపి.. ఆపై వ్యక్తి ఆత్మహత్య.. రక్తపు మడుగులో మృతదేహాలు..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 21, 2021 | 11:03 PM

Maharashtra: మ‌హారాష్ట్ర‌లో దారుణం చోటుచేసుకుంది. నాగ్‌పూర్ సిటీలో ఓ వ్య‌క్తి కిరాతకంగా వ్యవహరించాడు. త‌న ఇంట్లో భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను, అత్త‌గారింట్లో అత్త‌ను, మ‌ర‌ద‌లును హ‌త్య‌చేసి ఆ త‌ర్వాత ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నాగ్‌పూర్‌లోని ప‌చ్‌ప‌వోలీ ఏరియాలో సోమ‌వారం తెల్ల‌వారుజామున ఈ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అలోక్ మ‌తుకార్ అనే వ్య‌క్తి సోమవారం తెల్ల‌వారుజామున త‌న భార్య విజ‌య (40) గొంతుకోసి చంపేశాడు. ఆ త‌ర్వాత కుమార్తె పారి (14), కొడుకు సాహిల్ (12) ను కూడా గొంతు కోసి కడతేర్చాడు. ఆ త‌ర్వాత అత్త‌గారింటికి వెళ్లి అత్త ల‌క్ష్మీ బోబ్డే (55), మ‌ర‌ద‌లు అమీషా బోబ్డే (21) ల‌ను గొంతులు కోసి చంపాడు. ఆ త‌ర్వాత త‌న ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

తొమ్మిది గంట‌లైనా ఇంట్లో నుంచి ఎవ‌రూ బ‌య‌టికి రాక‌పోవ‌డంతో పొరుగింటి వారు అనుమానం వ‌చ్చి కిటికీలోంచి చూడ‌గా ర‌క్త‌పు మ‌డుగులో మృత‌దేహాలు ప‌డివున్నాయి. అనంతరం వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మ‌తూక‌ర్ ఇంటి తలుపులు ప‌గుల‌గొట్టి మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి త‌ర‌లించారు. ఆ త‌ర్వాత మ‌తూక‌ర్ ఇంటికి సమీపంలో ఉన్న అత‌ని అత్త‌గారింట్లో అత్త ల‌క్ష్మి, మ‌ర‌ద‌లు అమీషా కూడా హ‌త్య‌కు గురైన‌ట్లు గుర్తించి వారి మృత‌దేహాల‌ను కూడా పోస్టుమార్టానికి త‌ర‌లించారు. మ‌తూక‌ర్ టైల‌రింగ్ బిజినెస్ చేస్తున్నాడ‌ు. అయితే.. గత కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు అవుతున్నాయని.. ఆ కార‌ణంగానే మాతుకర్ ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు పేర్కొంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Harassment: మార్ఫింగ్ ఫోటోలతో మహిళలకు బెదిరింపులు.. పక్కా స్కెచ్ వేసి అడ్డంగా బుక్ చేసిన..

ఈ నాలుగు రాశుల వారు బంధాల నుంచి విడిపోవడం విషయంలో చాలా ఫాస్ట్.. ఏ రాశుల వారు..ఎందుకు అలా ఉంటారు?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే