Harassment: మార్ఫింగ్ ఫోటోలతో మహిళలకు బెదిరింపులు.. పక్కా స్కెచ్ వేసి అడ్డంగా బుక్ చేసిన..

Harassment: మహిళలను టార్గెట్ చేసుకుని బెదిరింపులకు పాల్పడి లొంగిదీసుకుంటున్న ఓ యువకుడి ఆట కట్టించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు...

Harassment: మార్ఫింగ్ ఫోటోలతో మహిళలకు బెదిరింపులు.. పక్కా స్కెచ్ వేసి అడ్డంగా బుక్ చేసిన..
Arrest
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 21, 2021 | 10:22 PM

Harassment: మహిళలను టార్గెట్ చేసుకుని బెదిరింపులకు పాల్పడి లొంగిదీసుకుంటున్న ఓ యువకుడి ఆట కట్టించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అతని విధానాలతోనే ట్రాప్ చేసి అడ్డంగా బుక్ చేశారు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపేట ప్రాంతానికి చెంది యువకుడు ఆంజనేయులు ఇన్‌స్టాగ్రమ్ ‌వేదిగా మహిళలను పరిచయం చేసుకునేవాడు. అలా పరిచయం కొంత కాలానికి వారి మార్ఫింగ్ న్యూడ్ ఫోటోలను ఇన్‌స్టాగ్రమ్ మెసేంజర్ ద్వారా పంపించి బెదిరింపులకు పాల్పడేవాడు. ‘మీ కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా ఇలాగే మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను.

నేను చెప్పినట్లు మీరు న్యూడ్‌గా వీడియోలు తీసి వాట్సప్ ద్వారా పంపించండి’ అంటూ సదరు మహిళలను బెదిరించేవాడు. అయితే, ఆంజనేయులు బెదిరింపులకు వెరవని ఓ బాధితురాలు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఐపీ అడ్రస్ ఆధారంగా ట్రేస్ చేసిన పోలీసులు.. నిందితుడు ఆంజనేయులు ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తలరించారు. కాగా అరెస్ట్ సందర్భంగా అతని వద్ద నుంచి సెల్‌ఫోన్‌ ‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆంజనేయులు చాలా మంది మహిళలు, యువతులను ఇలా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Also read:

NID AndhraPradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..