CM KCR Visit Yadadri : యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్.. బుధవారం వాసాలమర్రి పర్యటన
వరంగల్ జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ నేరుగా యాదాద్రిలో పర్యటిస్తున్నారు. బాలాలాయంలో శ్రీలక్ష్మి నరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు.
వరంగల్ జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ నేరుగా యాదాద్రిలో పర్యటిస్తున్నారు. బాలాలాయంలో శ్రీలక్ష్మి నరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. బాలాలయం మండపంలో సీఎం కేసీఆర్‌కు వేదాశీర్వచనం అందజేశారు. అంతకు ముందుహెలికాప్టర్‌లో యాదాద్రికి చేరుకున్న ఆయనకు… ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ నిర్మాణ పనులు పరిశీలించారు. వైకుంఠద్వారం వద్ద భవనాల కూల్చివేత పనులు కూడా పర్యవేక్షించారు.
బెంగుళూర్‌కు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థచే ప్రధానాలయానికి ఏర్పాటు చేసిన పసిడి వర్ణపు విద్యుత్ కాంతులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట ఉన్న మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఉన్నారు.
మంగళవారం వాసాలమర్రికి…
యాదాద్రి పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ బుధవారం ఇదే జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించనున్నారు. ఇందుకు గాను సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్… వాసాలమర్రిలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యురాలు గొంగిడి సునీత, కలెక్టర్ పమేలా సత్పతితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.సభాస్థలి, భోజనశాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభ విజయవంతానికి పూర్తిస్థాయిలో కార్యాచరణ ఉండేందుకు గాను… సమీక్ష నిర్వహించారు. గ్రామసభలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు… ఇతర గ్రామాల వారు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. సీఎం గ్రామ పర్యటనకు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో… వాసాలమర్రిలో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సహపంక్తి భోజనాలు ఒకచోట, సభ మరోచోట నిర్వహించేలా పనులు సాగుతున్నాయి. ఇంటింటికి తిరిగి గ్రామస్థులకు అధికారులు పాసులు అందజేస్తున్నారు.