Bengal Violence: బెంగాల్ హింస‌పై ఎన్‌హెచ్ఆర్సీ క‌మిటీ.. హైకోర్టు ఆదేశాలతో ఉత్తర్వులు..

Bengal post-poll violence: ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత జ‌రిగిన హింసాత్మ‌క సంఘ‌ట‌న‌ల‌పై న‌మోదైన కేసుల‌పై ద‌ర్యాప్తు చేసేందుకు ఎన్‌హెచ్ఆర్సీ

Bengal Violence: బెంగాల్ హింస‌పై ఎన్‌హెచ్ఆర్సీ క‌మిటీ.. హైకోర్టు ఆదేశాలతో ఉత్తర్వులు..
Bengal Post Poll Violence
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 22, 2021 | 6:10 AM

Bengal post-poll violence: ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత జ‌రిగిన హింసాత్మ‌క సంఘ‌ట‌న‌ల‌పై న‌మోదైన కేసుల‌పై ద‌ర్యాప్తు చేసేందుకు ఎన్‌హెచ్ఆర్సీ సోమవారం ఒక కమిటీని నియమించింది. ఈ మేరకు జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం ఛైర్‌ప‌ర్స‌న్ జ‌స్టిస్ అరుణ్ మిశ్రా ఏడుగురు స‌భ్యుల‌తో క‌మిటీని నియ‌మించారు. ఎన్‌హెచ్ఆర్సీకి చెందిన సభ్యుడు రాజీవ్ జైన్ కమిటీకి చీఫ్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్‌పర్సన్ అతిఫ్ రషీద్, జాతీయ మహిళా కమిషన్ స‌భ్యుడు (డాక్టర్) రాజుల్‌బెన్ ఎల్. దేశాయ్, ఎన్‌హెచ్ఆర్సీ డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సంతోష్ మెహ్రా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రిజిస్ట్రార్ ప్రదీప్ కుమార్ పంజా, బెంగాల్ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ సభ్య కార్యదర్శి శ్రీ రాజు ముఖర్జీ, ఎన్‌హెచ్ఆర్సీ డీఐజీ (ఇన్వెస్టిగేషన్) మన్జిల్ సైని సభ్యులుగా వ్యవహరించనున్నారు.

అయితే.. ప‌శ్చిమ బెంగాల్‌ ఎన్నిక‌ల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మూడోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల కేసుల‌ను ప‌రిశీలించేందుకు ఒక క‌మిటీని నియ‌మించాల‌ని ఈ నెల 18న‌ కోల్‌క‌తా హైకోర్టు జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘాన్ని ఆదేశించింది. అయితే ప్ర‌భుత్వం, ప్ర‌భుత్వ అధికారుల‌కు వ్యతిరేకంగా ఉన్న‌ ఈ తీర్పును వెన‌క్కి తీసుకోవాల‌ని కోరుతూ బెంగాల్ ప్ర‌భుత్వం ఒక పిటిష‌న్‌ను కూడా దాఖ‌లు చేసింది. ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బిందాల్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమ‌వారం ఈ పిటిష‌న్‌ను ప‌రిశీలించి తిరిస్క‌రించింది. ఈ నేప‌థ్యంలో ఎన్‌హెచ్ఆర్సీ ఏడుగురు స‌భ్యుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటు చేస్తూ.. జ‌స్టిస్ అరుణ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read:

CM KCR: యాదాద్రి పనులన్నీ రెండున్నర నెలల్లో పూర్తవ్వాలి.. అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన పథకంలో మరో మార్పు… మొబైల్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!