PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన పథకంలో మరో మార్పు… మొబైల్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో వారి స్థితిని తనిఖీ చేసుకోవచ్చు.....
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం… ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద… కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున జమ చేసింది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ఏడాదికి మూడు దఫాల్లో డబ్బు జమ చేస్తోంది. ఇలా మూడుసార్లూ కలిపి మొత్తం సంవత్సరానికి రూ.6,000 జమ చేస్తోంది. ఈ పథకం ప్రారంభించాక… ఏడో విడత నిధులను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఈ నిధుల ద్వారా రైతులు… పంటలకు విత్తనాలు, పురుగు మందులూ కొనుక్కోగలరు. ఈ డబ్బు కోసం రైతులు… ఏ ప్రభుత్వ కార్యాలయానికీ వెళ్లాల్సిన పనిలేదు. డైరక్టుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకే మనీ జమ అవుతుంది. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకొని… వ్యవసాయం చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది
ఈ ఆర్థిక సంవత్సరం (2020-2021)లో ఏప్రిల్-జులై మధ్య కాలానికి మొదటి విడత నిధులు ఇవ్వగా… ఆగస్ట్ నుంచి నవంబర్ నాటికి రెండో విడత నిధులు ఇచ్చారు. మూడో విడత డిసెంబర్ నుంచి మార్చి వరకూ ఉంటుంది. ఈ నిధులు డిసెంబర్‌లో వచ్చాయి. ఇప్పటివరకూ ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 11.17 కోట్ల మంది రైతులకు… రూ.95 కోట్లను విడుదల చేసింది.
ఎవరైనా రైతు అకౌంట్‌లో డబ్బు జమ కాకపోతే… ఆ రైతు… ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోలేదని అర్థం. వెంటనే వారు అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం వారు ముందుగా… తమ పేరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇన్‌స్టాల్‌మెంట్ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోవాలి.. ఇందు కోసం పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో వారి స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. ఎనిమిదవ విడత రూ .20,000 కోట్లకు పైగా దేశంలోని 9.5 కోట్లకు పైగా రైతులకు వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేశారు.
మరిన్ని వివరాలు మరియు సమాచారం కోసం, పిఎం-కిసాన్ పథకం కింద రైతు-లబ్ధిదారులు PM- కిసాన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో pmkisan.gov.in వద్ద లాగిన్ అవ్వవచ్చు.