Himachal Pradesh: టీ కొట్టుకు రూ.55 లక్షల కరెంటు బిల్లు.. కంగుతిన్న దుకాణదారుడు.. ( వీడియో )
హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలోని హరోలీలో ప్రాంతంలో నరేశ్ కుమార్ అనే వ్యక్తి టీ కొట్టు నడుపుతున్నాడు. ఇటీవల నాలుగు నెలలకుగానూ అతనికి రూ. 6,702 బిల్లు వేసింది విద్యుత్ శాఖ.
హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలోని హరోలీలో ప్రాంతంలో నరేశ్ కుమార్ అనే వ్యక్తి టీ కొట్టు నడుపుతున్నాడు. ఇటీవల నాలుగు నెలలకుగానూ అతనికి రూ. 6,702 బిల్లు వేసింది విద్యుత్ శాఖ. దానిని అతను ఆర్థిక ఇబ్బందులు కారణంగా చెల్లించలేదు. దీంతో అధికారులు అతని దుకాణానికి కరెంట్ సరఫరాను నిలిపివేశారు. చేసేది ఏం లేక బకాయిలను ఆన్లైన్లో చెల్లించాలని పోర్టల్లో చూశాడు. అంతే అక్కడ ఉన్న బిల్లును చూసి అతడి మైండ్ బ్లాంక్ అయ్యింది. అందులో రూ. 6 వేలకు బదులుగా.. రూ. 55 లక్షల 14వేల 945 కనిపించింది. ఒక్కసారిగా నివ్వెరపోయిన అతను విద్యుత్ బోర్డ్ను ఆశ్రయించాడు. విద్యుత్ శాఖ అధికారులు తప్పు దిద్దుకునే పనిలో ఉన్నారు. కాగా గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా సార్లు వెలుగుచూశాయి. ముందుగా అజాగ్రత్తగా వ్యవహరించడం.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం విద్యుత్ శాఖ సిబ్బందికి అలవాటుగా మారింది. అసలే భారీ విద్యుత్ బిల్లులతో విసిగి వేసారిపోతున్న జనాలకు.. సిబ్బంది కొత్త టెన్షన్లు తెచ్చిపెడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: చైనా ల్యాబ్ నుంచి బయటకొచ్చిన వయాగ్రా దోమలు….!! ( వీడియో )
Biden Dog Dies: అమెరికా అధ్యక్షుడి బైడెన్ పెంపుడు కుక్క మృతి.. ( వీడియో )