Hyderabad: సహోద్యోగికి లైంగిక వేధింపులు.. జీహెచ్ఎంసీలో కలకలం.. విచారణకు మేయర్ ఆదేశం

GHMC: హైదరాబాద్ నగర పాలక సంస్థలో (జీహెచ్ఎంసీ) కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మహిళను స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ ఎం. శ్రీనివాస్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు

Hyderabad: సహోద్యోగికి లైంగిక వేధింపులు.. జీహెచ్ఎంసీలో కలకలం.. విచారణకు మేయర్ ఆదేశం
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 07, 2021 | 2:07 PM

GHMC: హైదరాబాద్ నగర పాలక సంస్థలో (జీహెచ్ఎంసీ) కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మహిళను స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ ఎం. శ్రీనివాస్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు.  శ్రీనివాస్‌ను వెంటనే సస్పెండ్‌ చేయడంతోపాటు మాతృశాఖకు పంపించాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్య విభాగం అడిషనల్‌ కమిషనర్‌ బాదావత్‌ సంతోష్‌ను పిలిచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు నేరుగా మేయర్‌కు ఫిర్యాదు చేయడంతో.. దీనిపై విచారణకు ఆదేశించారు.

చార్మినార్‌ జోన్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని.. ఆరోగ్య విభాగంలో స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ కొంత కాలంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌కు, కొందరు యూనియన్‌ నేతలకు గత వారమే ఫిర్యాదు చేసింది. అయితే.. సరైన పరిష్కారం లేకపోవడంతో తాజాగా ఆమె సోమవారం నేరుగా మేయర్‌ విజయలక్ష్మిని కలిసి తన బాధను వివరించింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్‌ విజయలక్ష్మి శ్రీనివాస్‌ను వెంటనే సస్పెండ్‌ చేయడంతో పాటు మాతృశాఖకు సరెండర్‌ చేయాలని.. అడిషనల్‌ కమిషనర్‌ను ఆదేశించారు.

విషయం తెలిసినప్పటికీ, తగిన విధంగా స్పందించని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌పై కూడా విజలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన శ్రీనివాస్‌ గత ఫిబ్రవరిలో పదోన్నతిపై బల్దియాకు వచ్చారు. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లకు గాను 15 సర్కిళ్లకు స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నాడని అధికారులు తెలిపారు. అయితే.. బాధితురాలి ఫిర్యాదు అనంతరం గ్రేటర్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ విచారణను ముమ్మరం చేసింది.

Also Read:

Viral Video: ముందు సింహంలా గర్జించింది.. తీరా రింగులోకి దిగి గజగజ వణికింది.. ఫన్నీ వీడియో

Watch Video: డ్రెస్సింగ్ రూంలో గొడవ పడిన పాక్ ప్లేయర్లు.. వైరలవుతోన్న వీడియో..! అసలేం జరిగిందంటే?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!