Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ముందు సింహంలా గర్జించింది.. తీరా రింగులోకి దిగి గజగజ వణికింది.. ఫన్నీ వీడియో

Dog barking on chickens: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. ఈ వీడియోలు

Viral Video: ముందు సింహంలా గర్జించింది.. తీరా రింగులోకి దిగి గజగజ వణికింది.. ఫన్నీ వీడియో
Dog Barking On Chickens
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 07, 2021 | 7:40 AM

Dog barking on chickens: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. ఈ వీడియో నెటిజన్లను తెగనవ్విస్తోంది. సాధారణంగా ఇంట్లో ఉన్న కుక్క కూడా సింహమే అనే సామెతను వింటూనే ఉంటాం. విశ్వాసానికి ప్రతీక అయిన కుక్కలను చాలామంది పెంచుకుంటుంటారు. అయితే.. కొన్ని కుక్కలు ఇంట్లోకి ఎవర్నీ అడుగుపెట్టనీవు. పక్కన యజమానులుంటేనే ఇంట్లోకి అనుమతిస్తాయి. అయితే.. సాధారణంగా మనుషుల స్వాభావం బయటపడినట్లే జంతువుల స్వాభావం కూడా బయటపడుతుందని, దూరంగా ఉన్నప్పుడు ఒకలా.. దగ్గరగా ఉన్నప్పుడు మరోలా ఉంటుందని చాలామంది పేర్కొంటుంటారు. అలానే ఈ వీడియో కూడా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక పెంపుడు కుక్క దూరం నుంచి కోళ్లను చూసి మొరుస్తుంది. కానీ అది కోళ్ల దగ్గరికి వెళ్ళిన వెంటనే.. భయంతో తోక ముడుచుకుంటుంది. అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. వీడియోలో మీరు ఒక ఇనుప రెయిలింగ్ గోడను చూడవచ్చు. దానికి ఓ వైపు కుక్క ఉంటుంది.. మరోవైపు రెండు కోళ్లు ఉంటాయి. కుక్క ఇటువైపు నుంచి ఆ కోళ్లను చూసి.. మీద పడి కరిచేటట్లు అరుస్తుంది. ఈ క్రమంలో.. ఒక అమ్మాయి కుక్కను ఎత్తుకుని.. కోళ్లు ఉన్న వైపున వదిలిపెడుతుంది. అయితే.. అప్పటివరకు మొరిగిన కుక్క ఒక్కసారిగా తోక ముడుచుకుంటుంది. ఏడుపు ముఖం పెట్టి అక్కడి నుంచి తీసుకెళ్లండి అనేలా.. రేయిలింగ్‌ను పట్టుకొని ప్రాథేయపడుతుంది.

వైరల్ వీడియో..

కాగా.. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఇలాంటి వీడియో మీరు ఇంతకు ముందెన్నడూ చూసి ఉండరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫన్నీ వీడియోను asupan.reels.hewani అనే యూజర్ షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగామంది వీక్షించారు. 1 లక్ష 33 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసి.. పలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడూ అతి పనికిరాదంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Shocking Video: వామ్మో.. డేగ ‘వేట’ మాములుగా లేదుగా.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! వైరలవుతోన్న వీడియో

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?