Shocking Video: వామ్మో.. డేగ ‘వేట’ మాములుగా లేదుగా.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! వైరలవుతోన్న వీడియో
Viral Video: డేగ తన వేటను వందల అడుగుల ఎత్తు నుంచి గమనించి తన పనిని వేగంగా పూర్తి చేస్తుందని తెలుసు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఒక డేగ నీటిలోకి మునిగి చేపలను వేటాడం చూస్తే షాకింగ్‌గానే ఉంది.
Shocking Video: జంతువులు ఎల్లప్పుడూ తమ ఆహారం కోసం వెతుకుతూనే ఉంటాయి. అవకాశం లభించిన వెంటనే ఇతర జంతువులపై దాడి చేస్తాయి. ఈ జంతువులు ఎరను పట్టుకోవడానికి చాకచక్యంగా వ్యవహరిస్తూ దాడికి సిద్ధమవుతాయి. ముఖ్యంగా సింహం, చిరుత వంటి పెద్ద జంతువుల శైలి నెట్టింట్లోనూ వైరల్‌గా మారిన వీడియోలు చాలానే ఉన్నాయి. అందులో జంతువులు ఒకదానికొకటి వేటాడడాన్ని చూడవచ్చు. అయితే మీరు ఎప్పుడైనా డేగ వేటను చూశారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో డేగ చేపపై దాడి చేయడం చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే.
డేగ తన వేటను వందల అడుగుల ఎత్తు నుంచి చాలా జాగ్రత్తగా గమనించి, ఆ తర్వాత రెప్పపాటులోనే తన పని పూర్తి చేస్తుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఒక డేగ నీటిలోకి మునిగి మరీ చేపలను వేటాడింది.
డేగ వేగంగా ఎగురుతూ వచ్చి నదిలోకి మునగడం వీడియోలో కనిపిస్తుంది. పక్షి నీళ్లలో స్నానం చేయడానికి దిగిందా అనుకునే లోపు చేపను పట్టుకుని పైకి రావడం గమనించవచ్చు. ఆ తర్వాత మళ్లీ ఆకాశంలోకి ఎగురుతుంది. డేగ గోళ్లలో ఓ పెద్ద చేప చిక్కుకుని, విడిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. కానీ, డేగ పట్టు ముందు చేప ఓడిపోయింది.
ఈ షాకింగ్ వీడియో లైఫ్ అండ్ నేచర్ అనే ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. డేగ పదునైన కళ్లను చూసి ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. అంత ఎత్తులో ఎగురుతున్నప్పుడు కూడా నీటికింద ఉన్న చేపను ఎలా చూసిందోనని షాకవుతున్నారు. ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యంగా ఉందని ఒక యూజర్ కామెంట్ చేశాడు.
— Life and nature (@afaf66551) December 2, 2021
Zoom Call: సర్‌ప్రైజ్ ఇస్తాడనుకుంటే.. షాకిచ్చాడు.. మూడు నిమిషాల్లో 900 మంది ఔట్!