Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zoom Call: సర్‌ప్రైజ్‌ ఇస్తాడనుకుంటే.. షాకిచ్చాడు.. మూడు నిమిషాల్లో 900 మంది ఔట్‌!

Mortgage Lender Better.com employees: ఉద్యోగులంతా హ్యాపీగా పనిచేసుకుంటున్నారు.. ఇంతలో కంపెనీ బాస్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ఉందంటూ మెస్సెజ్ వచ్చింది. అయితే.. క్రిస్మస్ సందర్భంగా

Zoom Call: సర్‌ప్రైజ్‌ ఇస్తాడనుకుంటే.. షాకిచ్చాడు.. మూడు నిమిషాల్లో 900 మంది ఔట్‌!
Vishal Garg
Follow us
KVD Varma

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 06, 2021 | 9:56 PM

Mortgage Lender Better.com employees: ఉద్యోగులంతా హ్యాపీగా పనిచేసుకుంటున్నారు.. ఇంతలో కంపెనీ బాస్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ఉందంటూ మెస్సెజ్ వచ్చింది. అయితే.. క్రిస్మస్ సందర్భంగా సెలవులు, ఇంక్రిమెంట్ల గురించి శుభవార్తలు చెబుతారేమోనని ఆ కంపెనీ ఉద్యోగులు ఆలోచించారు. కానీ.. వారికి ఊహించని పరిణామం ఎదురైంది. శుభవార్త అనుకున్నది కాస్త షాకింగ్ వార్తలా మారింది. బెట్టర్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ విశాల్ గార్గ్ ఉద్యోగులతో జూమ్ వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. షాకింగ్ న్యూస్ తెలిపారు. ఏకంగా 900 మంది ఉద్యోగులను తన కంపెనీ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించాడు. జూమ్ కాల్‌లో కంపెనీ సీఈఓ చెప్పిన మాటలు వీని ఉద్యోగులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

అమెరికాకు చెందిన గృహ రుణాల సంస్థ మోర్ట్‌గేజ్ లెండర్ బెటర్.కామ్ (MortgageLenderBetter.com) సీఈఓ విశాల్ గార్గ్ బుధవారం ఈ ప్రకటన చేశారు. తన కంపెనీ ఉద్యోగులతో జూమ్ కాల్‌లో మాట్లుడుతూ సంస్థ పనితీరు, సమర్థత ఇతర కారణాల వల్ల 900 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి వార్తని మీరెవరూ వినాలని కోరుకొని ఉండరని.. దురదృష్టవశాత్తూ.. కాల్ గ్రూప్‌లో ఉన్నవారందరినీ.. ఉద్యోగం నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల తాను చాలా బాధపడుతున్నానన్నారు. మార్కెట్ మందగమనం, కంపెనీ పనితీరు తదితర కారణాల వల్ల సిబ్బందిని తక్షణమే తొలగిస్తున్నామని గార్గ్‌ తెలిపారు. ఈ సందర్భంగా గార్గ్‌.. ఉద్యోగుల పనితీరుపై కూడా అసహనం వ్యక్తం చేశారు. రోజుకు కనీసం 8 గంటలు పనిచేయాల్సిన ఉద్యోగులు 2 గంటలు మాత్రమే పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

వీడియో.. 

విశాల్ గార్గ్ చేసిన జూమ్‌ వీడియో కాల్‌ని ఒక ఉద్యోగి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజెన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఇంతకుముందు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను ఈ మెయిల్ ద్వారా తొలగించాడని పేర్కొ్ంటున్నారు. కరోనా కాలంలో సిబ్బందిని తగ్గించినట్లు తెలిపారు.

Also Read:

Viral Video: నన్ను గెలికితే ఇలానే ఉంటుంది.. దీని దెబ్బ అదుర్స్.. నెట్టింట వీడియో వైరల్

Viral Video: అబ్బ.. మిరపకాయతో ఇలా కూడా చేస్తారా..? ఎలా వస్తాయిరా బాబూ మీకు ఈ ఐడియాలు..!