Viral Video: అబ్బ.. మిరపకాయతో ఇలా కూడా చేస్తారా..? ఎలా వస్తాయిరా బాబూ మీకు ఈ ఐడియాలు..!

Mirchi Ice Cream Roll: ఇటీవల కాలంలో ఎన్నో రకాల వంటలు తెగవైరల్ అవుతున్నాయి. ఇలాంటి రకరకల వంటకాలను చూసి చాలామంది నెటిజన్లు భయపడుతున్నారు. తాజాగా అలాంటి జాబితాలోకి

Viral Video: అబ్బ.. మిరపకాయతో ఇలా కూడా చేస్తారా..? ఎలా వస్తాయిరా బాబూ మీకు ఈ ఐడియాలు..!
Mirchi Ice Cream Roll
Follow us

|

Updated on: Dec 06, 2021 | 8:46 PM

Mirchi Ice Cream Roll: ఇటీవల కాలంలో ఎన్నో రకాల వంటలు తెగవైరల్ అవుతున్నాయి. ఇలాంటి రకరకల వంటకాలను చూసి చాలామంది నెటిజన్లు భయపడుతున్నారు. తాజాగా అలాంటి జాబితాలోకి మరో వంటకం వచ్చి చేరింది. ‘ఝన్నత్ మిర్చి ఐస్ క్రీమ్ రోల్’ పేరుతో ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను చాలా మంది చూసి.. అసహ్యించుకుంటున్నారు. అంతలా ఈ వంటకంలో ఏముంది.. ఇలాంటి వంటలు ఎలా తయారు చేస్తారంటూ భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. వైరల్‌ అయిన 55 సెకన్ల వీడియో క్లిప్‌లో.. వీధి వ్యాపారి పచ్చి మిరపకాయలను కోసి, దానిపై నుటెల్లాను జోడించడాన్ని చూడవచ్చు. ఆ తర్వాత విక్రయదారుడు మిల్క్ క్రీమ్ పోసి బాగా కలుపుతాడు. తరువాత ఈ మిశ్రమాన్ని రోల్స్‌గా చేసి ఫ్రీజర్‌లో ఉంచుతాడు. విక్రేత ఐస్‌క్రీమ్‌ను పచ్చి మిరపకాయ ముక్కలతో ఎలా అలంకరించాడో ఈ వీడియోలో చూడవచ్చు. ఈ రెసిపీలో ఎక్కువగా మిరపకాయలు జోడించి.. ఐస్‌క్రీమ్‌ను కస్టమర్‌కు అందిస్తాడు.

ఈ చిత్ర విచిత్రమైన ఐస్ క్రీం క్లిప్‌ను రిషబ్ సింగ్ అనే పేరుతో ఇండోర్‌కు చెందిన ఫుడ్ వ్లాగర్ షేర్ చేశాడు. ఈ విచిత్రమైన ఐస్ క్రీం వీడియోను ఏడు లక్షలకు పైగా వీక్షించారు. అయితే.. దీనిని చూసి వినియోగదారులు.. యాక్‌ అంటూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను 38,000 మందికి పైగా లైక్ చేసారు. అయితే.. మెజారిటీ ఇంటర్నెట్ వినియోగదారులు ‘ఐస్ క్రీం ప్రయోగాన్ని’ అసహ్యంగా భావిస్తున్నారు. అయితే ఈ రెసిపీని కొంతమంది వినియోగదారులు.. ఆశ్యర్యంగా పేర్కొంటున్నారు.

వైరల్ వీడియో.. 

“మాకు ఫుడ్ అబ్యూజ్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియా (FACBI) అవసరం” అంటూ మరో వినియోగదారుడు రాశాడు. గ్రహంపై సగం జనాభాను అంతమొందించడానికి ఇలాంటి చర్యలు అవసరమంటూ మరొక యూజర్ తెలిపాడు. కాగా.. ఇటీవల సోషల్ మీడియాలో విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓల్డ్ మాంక్‌తో గులాబ్ జామూన్‌, మ్యాగీ మిల్క్‌షేక్, ఒరియో పకోడా లాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.

Also Read:

Jaggery Recipes: చలికాలంలో బెల్లంతో ఇమ్యూనిటీ.. ఇలా చేస్తే వెచ్చని ఆరోగ్యం మీ సొంతం..

Omicron Variant: దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. మరో రెండు కేసులు నమోదు.. ఎక్కడంటే..?