Viral Video: నన్ను గెలికితే ఇలానే ఉంటుంది.. దీని దెబ్బ అదుర్స్.. నెట్టింట వీడియో వైరల్

Chicken hit on Cat: సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. అయితే.. ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా ఉంటే..

Viral Video: నన్ను గెలికితే ఇలానే ఉంటుంది.. దీని దెబ్బ అదుర్స్.. నెట్టింట వీడియో వైరల్
Chicken Hit On Cat
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 06, 2021 | 9:57 PM

Chicken hit on Cat: సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. అయితే.. ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అయితే.. జంతువుల ప్రపంచం కూడా కొంతవరకు మనుషుల మాదిరిగానే ఉంటుందని.. ఈ వీడియోలు చూస్తే మనకు అర్ధం అవుతుంది. ఇతర జీవుల్లో కూడా వేధింపులు, అపకారాలు సహజమేనని వాటిని చూస్తే అనిపిస్తుంది. అయితే.. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి చాలా మంది నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో కోడి, పిల్లికి సంబంధించినది. ఇది చూస్తే మనుషుల్లో కాకుండా ఇతర జీవుల్లో కూడా వేధింపులు సహజమేనని ఖచ్చితంగా చెప్పవచ్చు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక పిల్లి నిశ్శబ్దంగా కూర్చోవడాన్ని మనం చూడవచ్చు. దాని ముందు ఒక కోడి పుంజు ఉంటుంది. అయితే.. కోడి పుంజు పిల్లిని ఇబ్బందిపెట్టడాన్ని మనం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. కోడిపుంజు.. దాని ముక్కుతో పిల్లి తలపై పొడుస్తుంది. పాపం పిల్లి మాత్రం ముందు స్పందించదు. అయితే.. కోడిపుంజు అలానే వేధించడంతో.. పిల్లికి కోపం వస్తుంది. ఈ క్రమంలో పిల్లి.. తన పాదందో కొడి పుంజు తలపై కొడుతుంది. దీంతో కోడిపుంజు వెనక్కి తగ్గుతుంది. ఆ తర్వాత పిల్లి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

వైరల్ వీడియో.. 

View this post on Instagram

A post shared by md (@mdafzal_01)

పిల్లి, కోడిపుంజు ఈ చిలిపి వీడియోని నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో mdafzal_01 పేరుతో ఉన్న యూజర్ షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 7 మిలియన్లకు పైగామంది వీక్షించారు. దాదాపు 2 లక్షల మంది వీడియోను లైక్ చేసారు. దీంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. పిల్లి ఒక్క దెబ్బతో కోడిపుంజుకు చెక్ పెట్టిందంటూ పేర్కొంటున్నారు.

Also Read:

Viral Video: అబ్బ.. మిరపకాయతో ఇలా కూడా చేస్తారా..? ఎలా వస్తాయిరా బాబూ మీకు ఈ ఐడియాలు..!

Vote Fine: ఓటు వేయకపోతే ఇకపై భారీ జరిమానా.. సోషల్‌ మీడియాలో వార్త వైరల్‌.. ఇది నిజమేనా..?