Hyderabad: ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త, తింటే నేరుగా ఆసుపత్రికే..!

Hyderabad: ఉస్మానియా బిస్కెట్ తయారీలో ప్రామాణికత, శుభ్రత పాటించడం లేదంటూ అధికారులు రంగంలోకి దిగారు. అంతేకాక దాదాపు రూ. 36 వేల విలువైన ఉస్మానియా బిస్కెట్ స్టాక్‌ని సీజ్ కూడా చేశారు. అసలేం జరిగిందంటే.. ఉస్మానియా బిస్కెట్ ఎంతో రుచిగా ఉంటుందని వినయ్ వంగాల అనే యువకుడు శనివారం మియాపూర్‌లో ఓ ప్యాకెట్‌ను కొనుగోలు చేశాడు. అయితే తాను తింటున్న ఓ బిస్కెట్‌లో ఈగ ఉందని..

Hyderabad: ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త, తింటే నేరుగా ఆసుపత్రికే..!
Osmania Biscuits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 05, 2023 | 12:39 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 5: హైదరాబాద్ ప్రజలకు, పర్యాటకులకు బిర్యానీతో పాటు ఉస్మానియా బిస్కెట్ కూడా ఎంతో సుపరిచితం. ఎంతో రుచిగా ఉంటున్నాయని ఉస్మానియా బిస్కెట్లను ఇష్టంగా తినేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అసలు విషయం తెలిస్తే ఇకపై అలా చేయలేరు. ఎందుకంటే ఉస్మానియా బిస్కెట్ తయారీలో ప్రామాణికత, శుభ్రత పాటించడం లేదంటూ అధికారులు రంగంలోకి దిగారు. అంతేకాక దాదాపు రూ. 36 వేల విలువైన ఉస్మానియా బిస్కెట్ స్టాక్‌ని సీజ్ కూడా చేశారు. అసలేం జరిగిందంటే.. ఉస్మానియా బిస్కెట్ ఎంతో రుచిగా ఉంటుందని వినయ్ వంగాల అనే యువకుడు శనివారం మియాపూర్‌లో ఓ ప్యాకెట్‌ను కొనుగోలు చేశాడు. అయితే తాను తింటున్న ఓ బిస్కెట్‌లో ఈగ ఉందని గమనించాడు వినయ్. అంతే.. వెంటనే స్థానిక ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు తన ట్విట్టర్ ఖాతా నుంచి ఫిర్యాదు చేశాడు.

వినయ్ ట్వీట్‌పై స్పందించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ అధికారులు మియాపూర్‌లోని సదరు దుకాణంపై ఆదివారం తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా శాంపిల్స్ తీసుకున్న అధికారులు వెంటనే 36 వేల రూపాయల విలువైన ఉస్మానియా బిస్కెట్ల స్టాక్‌ని సీజ్ చేశారు. ఈ మేరకు వినయ్ ట్వీట్‌కి రిప్లై‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఉస్మానియా బిస్కెట్‌ స్టాక్‌ని అధికారులు సీజ్ చేసిన నేపథ్యంలో సీటీ పరిధిలోని పలువురు నెటిజన్లు.. హైదరాబాద్ వ్యాప్తంగా ఇలాంటి షాపులెన్నో ఉన్నాయని, వాటిపై కూడా తనిఖీలు అవసరమని అధికారులను కోరుతున్నారు. ఇంకా అధికారులు చేసిన ట్వీట్ ఫోటో ద్వారానే ఉస్మానియా బిస్కెట్ తయారీలో పరిశుభ్రత ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోందని, వారి చేతులకు కనీసం గ్లౌజ్‌లు కూడా లేవని, అధికారుల స్పందన అభినందనీయం అంటూ పలువరు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..