AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP : కూల్చివేతల్లో ఎంఐఎం ప్రాంతాలైన చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్లకు మినహాయింపులు దుర్మార్గం : బండి సంజయ్

జీహెచ్ఎంసీ అధికారులు, మేయర్ కలిపి అక్రమ కట్టడాలు కూల్చివేయాలని నిర్ణయించి కేవలం హిందువుల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ కూల్చివేతలు కొనసాగిస్తుండటం..

BJP : కూల్చివేతల్లో ఎంఐఎం ప్రాంతాలైన చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్లకు మినహాయింపులు దుర్మార్గం : బండి సంజయ్
GHMC
Venkata Narayana
|

Updated on: Jul 29, 2021 | 3:04 PM

Share

Bandi Sanjay : జీహెచ్ఎంసీ అధికారులు, మేయర్ కలిపి అక్రమ కట్టడాలు కూల్చివేయాలని నిర్ణయించి కేవలం హిందువుల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ కూల్చివేతలు కొనసాగిస్తుండటం అన్యాయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతల్లో ఎంఐఎం శాసనసభ్యుల ప్రాంతాలైన చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్లకు మినహాయింపు ఇవ్వడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు.

“ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూల్చివేతలు నిలిపివేయాలి. ఖైరతాబాద్ జోన్, చార్మినార్ జోన్ లో వేలాది అక్రమ నిర్మాణాలు కూల్చి వేసిన తర్వాత నే మిగతా జోన్ లలో చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.” అని బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.

“ఇక్కడ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎంఐఎం శాసన సభ్యుల నియోజకవర్గాలు అంటే ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు. వీటిని మినహాయింపు ఇచ్చి అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఇది ఒక రకంగా మెజారిటీ ప్రజలపై ప్రభుత్వం చేస్తున్న దాడి. జీహెచ్ఎంసీ అధికారులు, మేయర్ కలిపి అక్రమ కట్టడాలు కూల్చివేయాలని నిర్ణయించి కేవలం హిందువుల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ కూల్చివేతలు కొనసాగిస్తుండటం దుర్మార్గం. ఎంఐఎం శాసనసభ్యుల ప్రాంతాలైన చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్లకు మినహాయింపు ఇవ్వడం అన్యాయం.” అని సంజయ్ వరుస ట్వీట్లలో విమర్శలు గుప్పించారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఈరోజు ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగిందని.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి, అప్రజస్వామిక విధానాలను ప్రజలకు వివరించామని బండి సంజయ్ మరో ట్వీట్ లో వెల్లడించారు.

Read also :  Jagadish Reddy : ‘2004లో వాళ్ళ బతుకేందో స్పష్టంగా ఉంది, ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా’.. కోమటిరెడ్డి బ్రదర్స్ మీద నిప్పులు