TV9 Seed Ball: పుడమి తల్లికి పచ్చని తోరణం.. టీవీ9 సీడ్‌ బాల్‌ లక్ష్యం.. ఒకేరోజు లక్షన్నర సీడ్‌ బాల్స్‌..

TV9 Seed Ball Campaign: మెరుగైన సమాజం కోసం ఎప్పుడూ ముందుండే టీవీ9 పుడమి తల్లి రక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. ఇందులో భాగంగా ప్రారంభించిందే సీడ్‌ బాల్‌ క్యాంపెయిన్‌...

TV9 Seed Ball: పుడమి తల్లికి పచ్చని తోరణం.. టీవీ9 సీడ్‌ బాల్‌ లక్ష్యం.. ఒకేరోజు లక్షన్నర సీడ్‌ బాల్స్‌..
Tv9 Seed Ball
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 18, 2022 | 10:19 AM

TV9 Seed Ball Campaign: మెరుగైన సమాజం కోసం ఎప్పుడూ ముందుండే టీవీ9 పుడమి తల్లి రక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. ఇందులో భాగంగా ప్రారంభించిందే సీడ్‌ బాల్‌ క్యాంపెయిన్‌. గత మూడేళ్లుగా పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో టీవీ9 సీడ్‌బాల్‌ కార్యక్రమాన్ని ఓ ఉద్యమమంలా చేపడుతోంది. ఇందులో భాగంగా లక్షలాది విత్తనాలను జల్లుతూ పుడమి తల్లికి పచ్చని తోరణం కడుతోంది.

ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా టీవీ9 సీడ్‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే CSA, సహజ ఆహారం సౌజన్యంతో ఇప్పటికే 1 లక్ష 55 వేల సీడ్ బాల్స్‌ను తయారు చేశారు. వీటన్నింటినీ ఈరోజు (గురువారం) రెండు తెలుగు రాష్ట్రాల్లో జల్లుతున్నారు. టీవీ9 కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని వందలాది విద్యా సంస్థలు దాదాపు 3 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయడం విశేషం.

హైదరాబాద్‌లో..

టీవీ9 సీడ్‌బాల్‌ క్యాంపెయిన్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌ నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ సమీపంలో ఉన్న ఫోర్‌స్ట్రెక్‌ పార్క్‌లో సీడ్‌బాల్స్‌ను జల్లారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతో ష్ కుమార్, సినీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్‌ రజినీకాంత్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

అసలేంటీ సీడ్‌బాల్‌..

విత్తనాలు లేదా మనం తినే పండ్లలో ఉండే విత్తనాలను నేరుగా పాడేయకుండా వాటిని మట్టితో చిన్న బాల్స్‌లా తయారు చేయాలి. అనంతరం వాటిని వర్షాకాలం ఆరు బయట విసిరాలి ఇలా చేస్తే చెట్లు పెరిగి, పచ్చదనం పెరుగుతుంది. భారత్‌లో సుమారు 99 శాతం చెట్లు ఎవరి సహాయం లేకుండానే పెరుగుతాయి. అమెరికా, థాయిలాండ్, కెన్యా , ఆఫ్రికా వంటి దేశాల్లో సీడ్‌ బాంబింగ్ విధానం ద్వారా అడవుల విస్తరణ జరుగుతోంది. ప్రస్తుతం భారత్‌కు కూడా సీడ్‌ బాల్‌ ఉద్యమం ఎంతో అసవరం.

మరిన్ని లోకల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..