AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బంజారాహిల్స్ మల్టీప్లెక్స్‌లో ప్రమాదం.. పలువురు విద్యార్థులకు గాయాలు.. విద్యాశాఖ మంత్రి కీలక ఆదేశాలు

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఆర్కే సినీ మ్యాక్స్‌ లో ప్రమాదం చోటు చేసుకుంది. గాంధీ సినిమా చూసేందుకు వెళ్లిన భారతీయ విద్యా భవన్‌కు చెందిన 12 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులు ఎస్కలేటర్‌పై ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Hyderabad: బంజారాహిల్స్ మల్టీప్లెక్స్‌లో ప్రమాదం.. పలువురు విద్యార్థులకు గాయాలు.. విద్యాశాఖ మంత్రి కీలక ఆదేశాలు
Representative Image
Basha Shek
|

Updated on: Aug 18, 2022 | 3:17 PM

Share

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఆర్కే సినీ మ్యాక్స్‌ లో ప్రమాదం చోటు చేసుకుంది. గాంధీ సినిమా చూసేందుకు వెళ్లిన భారతీయ విద్యా భవన్‌కు చెందిన 12 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులు ఎస్కలేటర్‌పై ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిని విద్యార్థులను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని పాఠశాల విద్య సంచాలకులు దేవసేనను ఆదేశించారు. కాగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు గాంధీ సినిమా ఉచిత ప్రదర్శనలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజా ఘటనను దృష్టిలో ఉంచుకుని గాంధీ సినిమా థియేటర్లలో విద్యార్థుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను సూచించారు.

9మందిని డిశ్చార్జ్‌ చేశాం.. కాగా ఈ ప్రమాద ఘటనపై అపోలో ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గురువారం ఉదయం 9.50 గంటలకు భారతీయ విద్యాభవన్‌కు చెందిన 12 మంది విద్యార్థులు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. బాధితుల్లో ఒక టీచర్‌ కూడా ఉన్నారు. వారికి సత్వర చికిత్స అందించాం. అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించాం. పరిస్థితి మెరుగయ్యాక మొత్తం 13 మంది బాధితుల్లో 9 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశాం. మరో నలుగురిని అబ్జర్వేషన్‌లో ఉంచాం. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి ఆందోళన అక్కర్లేదు’ అని అపోలో యాజమాన్యం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్