AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఈ నెంబర్లు చాలా హాట్ గురూ..! ఫ్యాన్సీ నంబర్లకు పెరుగుతున్న క్రేజ్.. ఒక్కరోజే ఎన్ని లక్షలొచ్చాయో తెలుసా?

ఆదాయం రావాలంటే.. దానికి ఎన్నో దారులున్నాయి.. దానికి తగినట్లుగా తెలంగాణ రవాణా శాఖ ప్రణాళికలు రచించి.. కాసులను సమకూర్చుకుంటోంది. రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ బిడ్డింగ్ లో భారీ ఆదాయం వచ్చి చేరుతోంది. ప్రతి రోజు ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు పోటీ పడుతున్నారు. ఇటు ఆర్టీఏ అధికారులు నిర్వహిస్తున్న ఆన్ లైన్ బిడ్డింగ్‌లో గురువారం ఒక్కరోజే ఫ్యాన్సీ నంబర్లకి భారీగా ధరలు పలికాయి.

Hyderabad: ఈ నెంబర్లు చాలా హాట్ గురూ..! ఫ్యాన్సీ నంబర్లకు పెరుగుతున్న క్రేజ్.. ఒక్కరోజే ఎన్ని లక్షలొచ్చాయో తెలుసా?
Fancy Numbers Drive
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Oct 13, 2023 | 5:06 PM

Share

హైదరాబాద్, అక్టోబర్ 13: ఆదాయం రావాలంటే.. దానికి ఎన్నో దారులున్నాయి.. దానికి తగినట్లుగా తెలంగాణ రవాణా శాఖ ప్రణాళికలు రచించి.. కాసులను సమకూర్చుకుంటోంది. రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ బిడ్డింగ్ లో భారీ ఆదాయం వచ్చి చేరుతోంది. ప్రతి రోజు ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు పోటీ పడుతున్నారు. ఇటు ఆర్టీఏ అధికారులు నిర్వహిస్తున్న ఆన్ లైన్ బిడ్డింగ్‌లో గురువారం ఒక్కరోజే ఫ్యాన్సీ నంబర్లకి భారీగా ధరలు పలికాయి. గురువారం ఒక్కరోజే 41,86,370 ఆదాయం వచ్చింది. అత్యధికంగా టీఎస్ 09జీడీ9999 నంబర్ ప్లేట్‌కు 15లక్షల 53వేల ధరతో ముప్పాహోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బిడ్డింగ్‌లో దక్కించుకుంది.

ఫ్యాన్సీ నంబర్స్‌కు పెరుగుతున్న క్రేజ్‌తో రవాణా శాఖకు కాసుల పంట పడుతోంది. హైద్రాబాద్ ఆర్టీఏకు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్స్ కోసం వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. దీంతో నచ్చిన ప్యాన్సీ నంబర్ దక్కించుకునేందుకు ఎంత ఖర్చు చేయడానికైన వేనకాడటం లేదు. హైద్రాబాద్ ఆర్టీఏ నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ ఆక్షన్ తో ఒక్క రోజే 41,86,370 ఆదాయం వచ్చి చేరింది.

  • అత్యధికంగా TS 09 GD 9999 నంబర్ కు 15లక్ష 53 వేలకు ఆర్టీఏ ఆన్ లైన్ బిడ్డింగ్‌లో ధర పలికింది.
  • ఇక TS 09 GE 0009 నంబర్ 3లక్షల 29,999 ధరకు అమ్ముడు పోయింది
  • TS 09 GE 0001 ఫ్యాన్సీ నంబర్ 3లక్షల 6వేలు పలికింది.
  • ఇలా మరో ఆరు ఫ్యాన్సీ నంబర్లకు లక్షలు ఖర్చు చేసి పలు ప్రైవేట్ సంస్థల వ్యక్తులు దక్కించుకున్నారు.

కొత్త వెహికిల్స్ కొనడం ఒక ఎత్తు అయితే.. వాటికి ఫ్యాన్స్ నంబర్స్ కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. వెహికిల్ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్స్‌కు అయితే రోజు రోజకు క్రేజ్ పెరుగుతోంది. దీంతో రవాణా శాఖకు భారీగా ఆదాయం వచ్చి చేరుతోందని.. అధికారులు పేర్కొంటున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏ ( సెంట్రల్ జోన్) లో ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహిస్తున్నామని.. ఆసక్తిగల వాహనదారులు బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ( జేటీసీ) పాండురంగ నాయక్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..