Good News: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆ ప్రత్యేక రైళ్లు నెల రోజులు పొడగింపు
Railway Passenger Alert: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది.
Railway News: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే (South Central Railway).. ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. సికింద్రాబాద్ – మదురై (Secunderabad- Madurai) మధ్య నడుపుతున్న రెండు ప్రత్యేక రైళ్లను మరో నెల రోజుల పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు ద.మ.రైల్వే అధికారులు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ – మదురై ప్రత్యేక రైలు (నెం.07191)ను ఆగస్టు 29 తేదీ నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి సోమవారం సికింద్రాబాద్ నుండి బయలుదేరి వెళ్తుంది.
అలాగే మదురై – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (నెం.07192)ను ఆగస్టు 31 తేదీ నుంచి సెప్టెంబర్ 28 తేదీ వరకు పొడగిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి బుధవారం మదురై నుంచి బయలుదేరి వెళ్తుంది.
సికింద్రాబాద్ – మదురై మధ్య ప్రత్యేక రైలు పొడగింపు..
అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే పలు ప్రత్యేక రైళ్లను సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడగిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సదరు వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Extension of special train services @drmsecunderabad @drmhyb @VijayawadaSCR @drmned pic.twitter.com/CU6x0TeylS
— South Central Railway (@SCRailwayIndia) August 17, 2022
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..