షూటింగ్ వాహనం ఢీ.. పొన్నాల లక్ష్మయ్యకు తప్పిన ప్రమాదం

కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు పెను ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 45 సిగ్నల్ వద్ద సోమవారం రాత్రి ఆగి ఉన్న పొన్నాల కారు మీదకు ఓ సినిమా షూటింగ్‌కు చెందిన వాహనం దూసుకొచ్చింది. వెంటనే పొన్నాల పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి వచ్చి పరిశీలించిన పోలీసులు ఆ వాహనం డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ఆ సమయంలో కారులో పొన్నాల, ఆయన మనవడు ఉండగా.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:39 am, Tue, 29 October 19
షూటింగ్ వాహనం ఢీ.. పొన్నాల లక్ష్మయ్యకు తప్పిన ప్రమాదం

కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు పెను ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 45 సిగ్నల్ వద్ద సోమవారం రాత్రి ఆగి ఉన్న పొన్నాల కారు మీదకు ఓ సినిమా షూటింగ్‌కు చెందిన వాహనం దూసుకొచ్చింది. వెంటనే పొన్నాల పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి వచ్చి పరిశీలించిన పోలీసులు ఆ వాహనం డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ఆ సమయంలో కారులో పొన్నాల, ఆయన మనవడు ఉండగా.. అదృష్టవశాత్తు ఆ ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. అయితే పొన్నాల కారు ముందు భాగం బాగా ధ్వంసమైంది. ప్రమాదం నుంచి పొన్నాల, ఆయన మనవడు సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు పొన్నాల కారు ప్రమాదానికి గురైన వార్త తెలిసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఇంటి వద్దకు చేరుకొని ఆరోగ్యంపై ఆరా తీశారు.