Economic Survey: 2008 నాటి ఆర్థికమాంద్యం రాబోతుందా?.. AIతో ఐటీ ఉద్యోగాలకు ముప్పు తప్పదా?
ఈ ఏడాది బడ్జెట్‌కు ఆల్ లైన్స్ ఆర్ క్లియర్. నో మోర్ ఫికర్స్. జీడీపీ 6.8 శాతం నుంచి 7.2 శాతానికి పెరుగుతుందని, ఆర్థిక ప్రగతికి ఢోకా లేదని, వస్తువుల ధరలు స్థిరంగా కొనసాగుతాయని, అమెరికా సుంకాల భారాన్ని చాలా ఈజీగా తట్టుకోగలిగామని.. ఇలా ఆర్థిక సర్వేని టూ పాజిటివ్‌గా ఎక్స్‌పోజ్ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

ఈ ఏడాది బడ్జెట్‌కు ఆల్ లైన్స్ ఆర్ క్లియర్. నో మోర్ ఫికర్స్. జీడీపీ 6.8 శాతం నుంచి 7.2 శాతానికి పెరుగుతుందని, ఆర్థిక ప్రగతికి ఢోకా లేదని, వస్తువుల ధరలు స్థిరంగా కొనసాగుతాయని, అమెరికా సుంకాల భారాన్ని చాలా ఈజీగా తట్టుకోగలిగామని.. ఇలా ఆర్థిక సర్వేని టూ పాజిటివ్‌గా ఎక్స్‌పోజ్ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కానీ… ఇన్ ఫ్రంట్ దేరీజ్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్ అని వార్నింగులూ ఇచ్చారు. ఏమిటా హెచ్చరికలు.. ఎవర్ని భయపెడుతోంది ఆర్థిక సర్వే?
ప్రజానీకాన్ని ఫిదా చేసే పాయింట్లే కాదు, పరేషాన్ పెట్టించే ఫికర్లూ ఉన్నాయి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మ్మ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో..! గత ఏడాది సాధించిన అభివృద్ధి గురించి చెబుతూనే, భవిష్యత్తుపై చెప్పుకోదగ్గ భరోసా ఏమీ లేదని హెచ్చరిస్తోంది ఎకనమిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్. సాంకేతిక రంగంలో భారీ మార్పులు జరిగితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాగే విరుచుకుపడితే, దేశం 20 ఏళ్ల వెనక్కెళ్లే ప్రమాదం ఉందని, 2008 నాటి ఆర్థిక సంక్షోభాన్ని మళ్లీ చవిచూసే పరిస్థితి రావొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాలకు ప్రత్యక్ష ముప్పు తప్పదని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది ఆర్థిక సర్వే.
‘ఇప్పటిదాకా రొటీన్‌గా నేర్చుకునేవి కాకుండా, వొకేషనల్, టెక్నికల్, ప్రొఫెషనల్ స్కిల్స్ వృద్ధి చేసుకోవాలి. ప్రభుత్వ పాలసీలతో పాటు యువత ఇటువంటి ఆలోచన చేస్తేనే మేలు. నైపుణ్య కొరత ఉండే మిగతా రంగాల్లో ప్రవేశాల్ని కోరుకోవాలి. అప్పుడే ఏఐ తాకిడిని తట్టుకోగలం. మంచి ఉపాధి అవకాశాలు పెరిగి, ఆదాయ వృద్ధికి సాధమవుతుంది’ అని కేంద్ర ఆర్థికశాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ సూచిస్తున్నారు.
AI వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందనే అంచనాతో.. సంస్థలన్నీ దానిపైనే పెట్టుబడులు పెంచడం.. భారతదేశాన్ని పరోక్షంగా దెబ్బ తీస్తుందట. ప్రస్తుతం ఐటీ ఫీల్డును నమ్ముకుని మన దేశంలో 58 లక్షల మంది బతికేస్తున్నారు. రాత్రికి రాత్రే వీళ్లందరికీ ఉద్యోగాలు పోకపోవచ్చు. కానీ, గ్యారంటీలైతే తగ్గిపోతాయి. కాకపోతే, కొన్ని విభాగాల్లో ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. ఉద్యోగాలు ఉన్నపళంగా ఊడిపోకుండా ముందే మేలుకోవాలంటే ఏఐ ఎకనామిక్ కౌన్సిల్ పేరుతో ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండితీరాల్సిందే అంటోంది ఆర్థిక సర్వే.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలాగే 2026లో కూడా బంగారం ధరలు ఇదే మోతాదులో పెరిగే ఛాన్సుందని హింట్ ఇచ్చింది ఆర్థిక సర్వే. దీని ప్రభావంతో డాలర్ ఇంకా బలహీనపడక తప్పదట. ఇవన్నీ మదుపర్లను టెన్షన్ పెట్టించే అంశాలే. సో, ఇన్ ఫ్రంట్ దేరీజ్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్. ఇదైతే పక్కా. మరి, పొంచి ఉన్న ప్రమాదాలను దీటుగా ఎదుర్కొవాలంటే, దీర్ఘకాలిక వ్యూహాలతో బడ్జెట్‌ను డిజైన్ చేసుకోక తప్పదా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
