మందుబాబుల జోరు.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బోలెడు
హైదరాబాద్: రాజధానిలో మందుబాబుల సంఖ్య ఏ వారానికి ఆ వారం జోరందుకుంటోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వారిని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వీకెండ్ వస్తే చాలు రెచ్చిపోతున్నారు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మోతాదుకు మించి మద్యం తాగి.. వాహనాలు డ్రైవ్ చేస్తున్న 62 మంది పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 40 కార్లు, […]

హైదరాబాద్: రాజధానిలో మందుబాబుల సంఖ్య ఏ వారానికి ఆ వారం జోరందుకుంటోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వారిని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వీకెండ్ వస్తే చాలు రెచ్చిపోతున్నారు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మోతాదుకు మించి మద్యం తాగి.. వాహనాలు డ్రైవ్ చేస్తున్న 62 మంది పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 40 కార్లు, 22 బైక్‌లు సీజ్ చేశారు.




