AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గణనాధుని నిమర్జనోత్సవంలో మందుబాబుల పాడు పని.. ఊరేగింపు వాహనాలపైనే పబ్లిక్‌గా దావత్‌లు..

Hyderabad: హైదరాబాద్‌లోని వినాయక నిమజ్జన ఉత్సవాల ఊరేగింపులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు ప్రతి సంవత్సరం వైన్ షాపులను మూసేస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా 26, 27, 28 మూడు రోజులపాటు వైన్ షాపులను బంద్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం సేవించి నిమజ్జనోత్సవంలో పాల్గొనటాన్ని నిషేధించారు. అయినా బందు బాబులు మాత్రం వెనక్కి..

Hyderabad: గణనాధుని నిమర్జనోత్సవంలో మందుబాబుల పాడు పని.. ఊరేగింపు వాహనాలపైనే పబ్లిక్‌గా దావత్‌లు..
Spot Visuals
Sravan Kumar B
| Edited By: |

Updated on: Sep 29, 2023 | 5:06 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్ 29: గణేష్ ఉత్సవాలకు తెలంగాణలో ప్రత్యేకమైన స్థలం ఉంది. దేశంలో ముంబై తర్వాత అంతా భారీగా గణేష్ ఉత్సవాలు జరిగేది హైదరాబాద్‌లోనే. లక్షల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి నవరాత్రులు పూజలు చేసే ఆ తర్వాత నిమర్జనం చేస్తారు. ఇక హైదరాబాద్ ట్యాంక్ బండి పరిసరాల్లో జరిగే గణేష్ నిమర్జనోత్సవం చూడటానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల్లో భక్తులు హైదరాబాద్‌కు వస్తారు. గణేష్ ఉత్సవాలలో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. అయితే ఈ ఉత్సవాల ఊరేగింపులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు ప్రతి సంవత్సరం వైన్ షాపులను మూసేస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా 26, 27, 28 మూడు రోజులపాటు వైన్ షాపులను బంద్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం సేవించి నిమజ్జనోత్సవంలో పాల్గొనటాన్ని నిషేధించారు. అయినా బందు బాబులు మాత్రం వెనక్కి తగ్గలేదు. వైన్స్ బంద్ ఉండడంతో మూడు రోజుల ముందుగానే మద్యాన్ని కొనుగోలు చేసి పెట్టుకున్న మందుబాబులు గణేష్ నిమజ్జనోత్సవంలో చాలా చోట్ల మద్యం సేవించారు.

అయితే అదేదో చాటుగానో గుట్టు చప్పుడు కాకుండా కాదు. అందరి ముందు పబ్లిక్ గానే నిమజ్జనానికి తరలిస్తున్న వాహనాలపైనే కూర్చొని మద్యం సేవించారు. ఇవి చూసిన భక్తులు ముక్కున వేలేసుకున్నారు. సర్వవిజ్ఞాలు తొలగించి విగ్నేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజించే ఎంతో నిష్టతో పాల్గొనవలసిన నిమర్జనం కార్యక్రమంలో ఇలా పద్యం సేవించడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ గానే రోడ్లమీద బీర్ బాటిల్ చేతిలో పట్టుకొని మద్యం సేవిస్తూ జనాల్లో తిరుగుతుండడంతో అక్కడే ఉన్న మహిళలు పిల్లలు కాస్త ఇబ్బందికి గురైన సంఘటనలు పలు చోట్ల జరిగాయి.

దీంతో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఏం లేదని అందరూ అనుకుంటున్నారు. గత వారం రోజుల్లో జరిగిన మద్యం అమ్మకాలు లెక్కలు బయటకు తీస్తే మందు బాబులు ఎంత జోష్‌లో ఉన్నారనేది తెలిసిపోతుందని అంటున్నారు. మరో పక్క పబ్లిక్‌గానే ఇలా మద్యం సేవిస్తున్న దరిదాపుల్లో కూడా పోలీసులు లేకపోవడం ఏంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై సీపీ స్పందించారు. ‘గణేష్ నిమజ్జనంలో మద్యం తాగి పాల్గొనడానికి సంబంధించిన వీడియోలు మా దృష్టికి కూడా వచ్చాయి. భక్తులు విజ్ఞతతో ఆలోచించాలి. వాళ్ల మీద కేసులు బుక్ చేసే ఉద్దేశం కూడా మాకు లేదు. ఇది అందరూ విజ్ఞతతో ఆలోచించాల్సిన విషయం’ అంటూ సీపీ అసహనం వ్యక్తం చేశారు