చంద్రబాబు, కేసీఆర్‌లపై దత్తాత్రేయ తీవ్ర విమర్శలు

తెలుగు రాష్ట్రాల సీఎంలపై బీజేపీ నేత దత్తాత్రేయ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ గోడ మీద పిల్లి లాంటోడు, చంద్రబాబు అవకాశవాదని ధ్వజమెత్తారు. ఫెడరల్, మహాకూటములు తమ దరిదాపుల్లో లేవని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఆరు స్థానాల్లో బీజేపీ గట్టి పోటీనిచ్చిందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌పై కేసీఆర్ సర్కార్‌ సవితితల్లి ప్రేమ చూపిస్తోందని, కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.52 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. 80 వేల కోట్లకు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి […]

చంద్రబాబు, కేసీఆర్‌లపై దత్తాత్రేయ తీవ్ర విమర్శలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 09, 2019 | 6:53 PM

తెలుగు రాష్ట్రాల సీఎంలపై బీజేపీ నేత దత్తాత్రేయ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ గోడ మీద పిల్లి లాంటోడు, చంద్రబాబు అవకాశవాదని ధ్వజమెత్తారు. ఫెడరల్, మహాకూటములు తమ దరిదాపుల్లో లేవని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఆరు స్థానాల్లో బీజేపీ గట్టి పోటీనిచ్చిందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌పై కేసీఆర్ సర్కార్‌ సవితితల్లి ప్రేమ చూపిస్తోందని, కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.52 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. 80 వేల కోట్లకు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. ఇంటర్‌ బోర్డు అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కమిటీ రిపోర్ట్ ఇచ్చినా గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోలేదని దత్తాత్రేయ నిప్పులు చెరిగారు.