Telangana: యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్‌పై దాడులు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతోనే..

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.. తెలంగాణా కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్. గతంలో పీసీసీ చీఫ్‌గా చేశారు.. ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. పార్టీ కీలక నేతల్లో ఒకరు. కానీ... ఆయన టార్గెట్‌గానే పార్టీలో అంతర్గతంగా కుట్ర జరుగుతోందా.. ఆయన ఇమేజ్‌ని బ్యాడ్‌ చేసే ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు..

Telangana: యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్‌పై దాడులు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతోనే..
Uttam Kumar Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 16, 2023 | 5:35 PM

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.. తెలంగాణా కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్. గతంలో పీసీసీ చీఫ్‌గా చేశారు.. ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. పార్టీ కీలక నేతల్లో ఒకరు. కానీ… ఆయన టార్గెట్‌గానే పార్టీలో అంతర్గతంగా కుట్ర జరుగుతోందా.. ఆయన ఇమేజ్‌ని బ్యాడ్‌ చేసే ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు.. కొన్ని నెలలుగా సస్పెన్స్‌లో ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు క్లయిమాక్స్‌కి చేరింది. గాంధీభవన్‌లో ఇదో కొత్త హాట్ టాపిక్.. డీటెయిల్స్‌లోకెళితే.. తనపైన, ఒక సీనియర్ నేతపైనా వాట్సప్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఉత్తమకుమార్‌ మే 5వ తారీఖున పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. భట్టి విక్రమార్క ఇంట్లో జరిగిన సేవ్‌ కాంగ్రెస్ మీటింగ్‌లో కూడా ఆయన ఇటువంటి అనుమానాలే వ్యక్తం చేశారు.

కట్‌ చేస్తే.. నిన్న యూత్‌కాంగ్రెస్‌ వార్‌రూమ్‌పై సీసీఎస్ ఆకస్మిక దాడులు చేశారు. కొంత సిస్టమ్స్‌, డేటా సీజ్ చేసి పట్టుకెళ్లారు. ఉత్తమ్ కంప్లయింట్ ఆధారంగానే దాడులు చేశామని, ఆయనకు వ్యతిరేకంగా ఇక్కడినుంచే ప్రచారం జరుగుతున్నట్టు గ్రహించామని చెప్పారు పోలీసులు. భీమవరంకు చెందిన ఒక మహిళ పేరు మీదున్న ఫోన్ నంబర్ ద్వారా.. వార్‌ రూమ్ ఇన్‌చార్జి ప్రశాంత్ నేతృత్వంలో ఈ యాంటీ ఉత్తమ్ క్యాంపైన్‌ జరుగుతోందన్నారు పోలీసులు.

అయితే, ఇదంతా శుద్ధ అబద్ధమంటోంది యూత్‌ కాంగ్రెస్. ఎప్పుడో కంప్లయింట్ ఇస్తే.. ఇప్పుడు స్పందించడమేంటి.. సదరు వ్యక్తిని కాకుండా కాకుండా కంప్యూటర్లు తీసుకుపోవడం ఏంటి.. అనేది యూత్ కాంగ్రెస్ నేతల ప్రశ్న. యాంటీ ఉత్తమ్ క్యాంపెయిన్ ఇష్యూ కాంగ్రెస్‌ని కుదిపెయ్యబోతోందా..? ఏఐసీసీ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..