TS High Court Jobs 2023: ఇంటర్ అర్హతతో తెలంగాణ హైకోర్టులో కాపీయిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్.. నో ఎగ్జాం!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టుల్లో.. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 84 కాపీయిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టుల్లో.. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 84 కాపీయిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్‌లో నిముషానికి 45 పదాలు టైప్ చేసే సామర్ధం ఉంటే చాలు.. ఎటువంటి రాత పరీక్షలేకుండా నేరుగా ఈ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఐతే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా జూన్ 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జూన్ 15వ తేదీ రాత్రి 11:59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం మే 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్/బీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) ఆధారంగా ఎంపిక చేస్తారు. స్కిల్ టెస్ట్ జులైలో ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.22,980ల నుంచి రూ.69,150ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.