Hyderabad: నకిలీ మెయిల్ ఐడీతో రూ.40 లక్షలు స్వాహా.. హైదరాబాద్ లో మరో సైబర్ క్రైమ్ ఇన్సిడింట్

కంటికి కనిపించరు.. కానీ ఖాతాల్లో డబ్బును మాయం చేసేస్తారు. దొంగతనంలో ఇదో రకమైన చోరీ మరి. టెక్నాలజీని యూజ్ చేసుకుని ఒక్క క్లిక్ తో నగదును స్వాహా చేసేస్తారు. మన దగ్గర నుంచే మన రహస్య సమాచారాన్ని..

Hyderabad: నకిలీ మెయిల్ ఐడీతో రూ.40 లక్షలు స్వాహా.. హైదరాబాద్ లో మరో సైబర్ క్రైమ్ ఇన్సిడింట్
Cybercrime
Follow us

|

Updated on: Sep 20, 2022 | 5:24 PM

కంటికి కనిపించరు.. కానీ ఖాతాల్లో డబ్బును మాయం చేసేస్తారు. దొంగతనంలో ఇదో రకమైన చోరీ మరి. టెక్నాలజీని యూజ్ చేసుకుని ఒక్క క్లిక్ తో నగదును స్వాహా చేసేస్తారు. మన దగ్గర నుంచే మన రహస్య సమాచారాన్ని లాగి ఉన్నకాడికి దోచేస్తారు. ఇదీ సైబర్ నేరగాళ్ల పంథా. వీరి నేరాలు హైదరాబాద్ లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులనే లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. తీరా మోసపోయామని భావించాక పెట్టేబేడా సర్దుకుని బిచాణా ఎత్తేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. నకిలీ ఈ మెయిల్ ఐడీ పంపించి రూ.40 లక్షలు దోచుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మరో సైబర్ నేరం వెలుగుచూసింది. హైదరాబాద్ కంచన్ బాగ్ లోని మిథాని సంస్థను మోసగించిన దుండగులు.. రూ.40 లక్షలు కొట్టేశారు. మిథాని సంస్థ కెనడా కు చెందిన నేచురల్ ఆలూ కంపెనీ నుంచి అల్యూమినియం కొనుగోలు చేసేందుకు మిథాని సంస్థ కొంత నగదును అడ్వాన్స్ గా చెల్లించింది. నేచురల్ అలూ కంపెనీ ఒప్పందం ప్రకారం మిథాని సంస్థకు అల్యూమినియం అందించింది.

అదే అదునుగా చూసుకున్న సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఆ సంస్థకు చెందిన కెనడా అకౌంట్ కాకుండా అమెరికాకు చెందిన అకౌంట్ నంబర్ నుంచి ఈ మెయిల్ పంపించారు. మిథాని సంస్థ దీనిని గమనించలేదు. కెనడాకు చెందిన సంస్థే మెయిల్ చేసిందని భావించింది. నేరగాళ్లు పంపించిన అకౌంట్ కు రూ.40 లక్షల బ్యాలెన్స్ నగదును చెల్లించింది. నేచురల్ ఆలు కంపెనీ ప్రతినిధులు బ్యాలెన్స్ పంపించాలని కోరడంతో అసలు విషయం బయటపడింది. తాము చెల్లించామని మిథాని సంస్థ చెప్పినప్పటికీ.. డబ్బు వారి ఖాతాల్లోకి చేరలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధిత సంస్థ.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో పోలీసులకు కంప్లైంట్ చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి