AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: వాటెన్ ఐడియా సర్ జీ..!.. ఇలా కూడా డబ్బులు సంపాదించొచ్చని నిరూపించావ్ గా..

కూటి కోసం కోటి విద్యలు అని పెద్దలు సామెతలు చెబుతుంటారు. ఏం చేశామన్నది కాదు. తప్పు చేయకుండా న్యాయబద్ధంగా డబ్బులు సంపాదించాలి. అంతే గానీ అక్రమ మార్గంలో వెళ్లకూడదు. అది స్వల్ప కాలంలో...

Video Viral: వాటెన్ ఐడియా సర్ జీ..!.. ఇలా కూడా డబ్బులు సంపాదించొచ్చని నిరూపించావ్ గా..
Moving On Trolleys
Ganesh Mudavath
|

Updated on: Sep 20, 2022 | 4:20 PM

Share

కూటి కోసం కోటి విద్యలు అని పెద్దలు సామెతలు చెబుతుంటారు. ఏం చేశామన్నది కాదు. తప్పు చేయకుండా న్యాయబద్ధంగా డబ్బులు సంపాదించాలి. అంతే గానీ అక్రమ మార్గంలో వెళ్లకూడదు. అది స్వల్ప కాలంలో మంచి ప్రయోజనాలు ఇచ్చినా.. భవిష్యత్ లో తీవ్ర సమస్యలను తెచ్చి పెడతాయి. ఆర్థిక పరమైన అంశాలపై నిపుణులు ఎవరైనా చెప్పే మాట ఇదే. ఒక్కోసారి కష్టాల్లోనూ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని డబ్బులు సంపాదించేవారు మనకు అక్కడక్కడా కనిపిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్లిప్ లో ఓ ప్రాంతంలో నాలుగురోడ్ల కూడలి ఉంది. అక్కడ వర్షం కురవడంతో రోడ్డుపై నీరు చేరింది. అయినా వాహనాలు దూసుకుపోతున్నాయి. అవి వెళ్తున్న సమయంలో వాటి వెంట నీరు లేచి తంపర్లుగా పడుతోంది. ఇది నడిచి వెళ్లేవారికి ఇబ్బందిగా మారింది. వాళ్ల కాళ్లు, బూట్లు, బట్టలు తడిసిపోతాయి. బురద పడి పాడవుతాయి. ఇలాంటి వారికి ఆపద్బాంధవుడిలా వచ్చాడో వ్యక్తి. చిన్నపాటి తోపుడు బండిని రోడ్డుకు ఓ వైపు పెట్టుకుని నిలబడ్డాడు. పాదచారుల దగ్గర డబ్బులు తీసుకుని ఆ తోపుడు బండిపై నిలబెట్టి, రోడ్డుకు ఓ వైపు నుంచి మరోవైపు తీసుకెళ్లి వదిలేస్తున్నాడు. రోడ్డుపై నీటిలో నడుచుకుంటూ వెళ్లలేక చాలా మంది అతడికి డబ్బులు ఇచ్చి తోపుడు బండిలో రోడ్డు దాటుతున్నారు.

ఓ ప్రముఖ వెబ్‌సైట్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోకి ‘సమస్యలు ఉన్నప్పుడు సంపాదించే మార్గమిది’ అని క్యాప్షన్ ఇచ్చారు. వీడియో పోస్ట్ అయిన కాసేపటికే వైరల్ గా మారింది. ‘ముందు అవసరం ఏమిటో గుర్తించాలి. ఆ అవసరం తీర్చే పని చేయాలి.. ఇది వ్యాపారంలో మొదటి నియమం. ఈ వ్యక్తి దీన్ని పక్కాగా ఆచరించి చూపిస్తున్నాడు’ అని ఓ యూజర్ కామెంట్ చేస్తే, ‘ఇతను ఎవరోగానీ మంచి వ్యాపార వేత్తలా ఉన్నాడు’ అని మరి కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..