Viral Video: కంటైనర్లు తీస్తుండగా ఊహించని సంఘటన.. క్షణాల్లో సీన్ రివర్స్.. అందరూ చూస్తుండగానే.!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Sep 20, 2022 | 4:15 PM

ఓ భారీ ఓడ డాక్‌యార్డ్‌కు చేరుకుంది. అందులో ఉన్న సరుకును అక్కడున్న సిబ్బంది అన్‌లోడ్ చేస్తున్నారు. అయితే ఇంతలోనే..

Viral Video: కంటైనర్లు తీస్తుండగా ఊహించని సంఘటన.. క్షణాల్లో సీన్ రివర్స్.. అందరూ చూస్తుండగానే.!
Sea Eagle Ship

ఓ భారీ ఓడ డాక్‌యార్డ్‌కు చేరుకుంది. అందులో ఉన్న సరుకును అక్కడున్న సిబ్బంది అన్‌లోడ్ చేస్తున్నారు. అయితే ఇంతలోనే అనూహ్య సంఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే దెబ్బకు ఓడ క్షణాల్లో మునిగిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది.? ఆ కథేంటి.?

వివరాల్లోకి వెళ్తే.. టర్కీలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇస్కెండరమ్ పోర్ట్‌లో ఈజిప్ట్‌కు చెందిన సీ-ఈగిల్ అనే కార్గో ఓడ ఒక్కసారిగా బోల్తాపడింది. అందులో ఉన్న కంటైనర్లను అన్‌లోడింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. లోడ్‌ను దింపుతుండగా.. పడవ దానంతట అదే ముందుకు కదిలి.. ఆ వెంటనే నీట మునిగిపోవడం సిబ్బందిని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

కాగా, ఈ ఘటనపై టర్కీ రవాణా శాఖ ట్విట్టర్‌లో స్పందించింది. అదృష్టవశాత్తు అక్కడున్న సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. 24 కంటైనర్లు నీట మునిగిపోయాయని.. అంతేకాకుండా కొద్దిపాటి చమురు కూడా లీక్ అయిందని పేర్కొంది. మునిగిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. అయితే ఓడ మాత్రం గత కొంతకాలంగా బ్యాలెన్సింగ్ విషయంలో సమస్యలు ఎడుర్కున్తోందని టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే ఈ ఓడ సెప్టెంబర్ 17న ఇస్కెండరమ్ పోర్ట్‌కు చేరుకుందని.. అప్పుడే ఈ ప్రమాదం సంభవించిందని క్లారిటీ ఇచ్చింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu