Hyderabad: సివీ ఆనంద్‌ నయా మార్క్‌.. హైదరాబాద్‌ పోలీసింగ్‌లో సరికొత్త మార్పులు

ఎన్నో సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న నకిలీ సర్టిఫికెట్ల మాఫియాకు చుక్కలు చూపిస్తున్నారు సీసీ ఆనంద్.. మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న నకిలీ సర్టిఫికెట్ ముఠాలను గజ గజ వణికించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Hyderabad: సివీ ఆనంద్‌ నయా మార్క్‌.. హైదరాబాద్‌ పోలీసింగ్‌లో సరికొత్త మార్పులు
Cv Anand
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: May 19, 2022 | 3:58 PM

CP CV Anand mark in Hyderabad policing: హైదరాబాద్ కొత్వాల్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. సిటీ సీపీగా బాధ్యతలు చెపట్టిన నాటినుంచి ఆనంద్‌.. సిటీ పోలీసింగ్‌లో వైవిధ్య మార్పులు తీసుకొచ్చారు. పోస్టింగ్‌ల నుంచి ప్రమోషన్‌ల దాకా అన్నిట్లో తనదైన మార్క్ కనబరుస్తూ.. సీవీ ఆనంద్ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

నయా రూల్స్..

హైదరాబాద్ కొత్వాల్‌గా సీవి ఆనంద్‌ డిసెంబర్ 25, 2021న బాధ్యతలు చేపట్టారు. ఛార్జ్ తీసుకున్న మొదటి రోజునుంచే సిటీలో తనదైన మార్క్ కనబరుస్తూ హైదరాబాద్ పోలిసింగ్‌లో నూతన జోష్ నింపారు. సిటీలో చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. డ్రగ్స్ మూలాలు అరికట్టడంలో తోటి సిబ్బందికి దిశానిర్దేశం చేయటంతో పాటు డ్రగ్స్ పెడలర్లపై నిరంతర నిఘా కోసం కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్ ఏర్పాటు చేశారు. టోనీ లాంటి అంతర్జాతీయ డ్రగ్ డీలర్‌ను.. అతడి డెన్‌లోకి వెళ్లి మరీ పట్టుకొచ్చెలా సిబ్బందిని గైడ్ చేశారు కొత్వాల్.. ఇక సైబర్ నేరాలపై తన దైన స్టైల్‌లో ఆపరేట్ చేస్తున్నారు.. హ్యాకర్ల మూలాలు కదిలేలా సిటీ నుంచి ఇంటర్ పోల్ వరకు నెట్‌వర్క్‌ను విస్తీర్ణం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న నకిలీ సర్టిఫికెట్ల మాఫియాకు చుక్కలు చూపిస్తున్నారు సీసీ ఆనంద్.. మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న నకిలీ సర్టిఫికెట్ ముఠాలను గజ గజ వణికించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఊహించని పోస్టింగ్స్..

సీసీ ఆనంద్.. హైదరాబాద్ పోలీసింగ్ విధానంలో ఎన్నడూ లేని నూతన సంస్కరణలు తీసుకువచ్చారు. సిబ్బంది ప్రవర్తన నుంచి పోస్టింగ్‌లు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల వరకు అన్నింటిలోనూ తన ముద్ర కనబరుస్తున్నారు.. సిటీ పోలీస్‌లో ఉన్న అన్ని వింగ్‌లపై ప్రత్యేక ఫోకస్ పెట్టడమే కాకుండా లూప్ లైన్ వింగ్‌లను ఆక్టివ్ చేసేశారు. ముఖ్యంగా సీసీఎస్ లాంటి విభాగాల్లో పని ఒత్తిడి కారణంగా చాలా కేసులు పెండింగ్లో ఉండిపోతూ వచ్చాయి. దానికి పరిష్కారంగా సిసిఎస్‌కు అదనపు సిబ్బందిని కేటాయిస్తూ లా అండ్ ఆర్డర్.. ఎస్‌హెచ్‌ఓ గా చేసిన వారికి లూప్ లైన్ పోస్టింగ్స్ ఇస్తున్నారు.. అదే తరహాలో రెండు సంవత్సరాలు లూప్ లైన్ చేసిన వ్యక్తిని లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ ఇస్తూ తన మార్క్ పోలీసింగ్ కనబరుస్తూన్నారు. దీనిద్వారా పోలీసుల ప్రమోషన్లు పోస్టింగుల వ్యవహారంలో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్‌మెంట్‌ చాలా వరకు తాగుముఖం పట్టింది.. నూతన బదిలీల విధానం అమల్లోకి తెచ్చి పొలిటికల్ పోస్టింగ్స్‌కు చెక్ పెట్టారు.. ఎప్పుడూ లేనటువంటి మహిళా ఇన్స్పెక్టర్ లకు లా అండ్ ఆర్డర్ ఎస్‌వోఓ ను నియమించడంలోనూ తన మార్క్ కనబరిచారు.

లైమ్ లైట్‌లోకి సీసీఎస్‌..

ఇక వింగ్‌ల వారీగా టాస్క్ ఫోర్స్ పనిని కాస్త తగ్గించారు.. మునుపటి మాదిరిగా టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి పని ఒత్తిడి లేకుండా చేశారు.. అన్నిట్లో టాస్క్ ఫోర్స్‌ను ఇన్వాల్వ్ చేయకుండా నార్కోటిక్ వింగ్, సీసీ ఎస్ వింగ్ ను పని డివైడ్ చేసి దర్యాప్తు సాఫీగా జరిగేలా మార్క్ చూపించారు. పని చేసిన వారికే గుర్తింపు ట్యాగ్ లైన్‌తో సిబ్బందికి నిరంతర మానిటరింగ్ విధానాన్ని తెచ్చి.. నూతన ఒరవడికి నాంది పలికారు. వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదనే సంకేతాలు ఇస్తూ.. ఇప్పటికే ఇద్దరు ఇన్స్పెక్టర్ లను సస్పెండ్ చేశారు.. ఇంకా ఆరోపణలు వస్తున్న ఇన్స్పెక్టర్ లను అటాచ్‌లు చేస్తూ తన మార్క్ చూపిస్తున్నారు.

ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి తన మార్క్ పోలీసింగ్‌తో నేరస్తుల గుండెల్లో వణుకు పెడుతూ సిబ్బందికి చేదోడు వాదోడుగా ఉంటూ సిటీ పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ సివీ ఆనంద్ అటు నాయకుల నుంచి.. ఇటు సిబ్బంది నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.