Hyderabad: ఏకంగా అద్దెకు రూమ్ తీసి మరీ ప్రియుడితో రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికేసిన జవాన్ భార్య
ప్రియుడితో ఓ జవాన్ భార్య రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన నగరంలోని రహమత్‌నగర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
అక్రమ సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు కొందరు మహిళలు. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ.. బంధాలను పాడు చేసుకుంటున్నారు. తమ జీవితాలతో పాటు పిల్లల జీవితాలను కూడా బలి చేస్తున్నారు. తాజాగా ఓ గృహిణి ప్రియుడితో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని రహమత్‌నగర్‌లో చోటు చేసుకుంది. రహమత్‌నగర్(Rahamath Nagar)లోని యాదగిరినగర్(yadagiri nagar)లో జవాన్ మధుసూదన్ భార్య ఓ ఇళ్లు రెంట్‌కు తీసుకుని ఉంటోంది. ఆమె ఎంత తెగించిందంటే.. ఏకంగా ప్రియుడినే భర్తగా పరిచయం చేసి.. ఇల్లు అద్దెకు తీసుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా రాసలీలలు నడుపుతుంది. అయితే భార్య ప్రవర్తనపై జవాన్‌కు సమాచారం అందింది. దీంతో అతడు అకస్మాత్తుగా హైదరాబాద్ వచ్చాడు. భార్య.. ఆమె ప్రియుడితో ఏకాంతంగా ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వాళ్లను ఇంట్లోనే బంధించి తాళం వేశాడు మధుసూదన్. ఆపై భార్య, ఆమె ప్రియుడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. జవాన్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు వెల్లడించారు. జవాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. నమ్మించి మోసం చేసిందని ఆర్మీ జవాన్ బాధపడుతున్నారు.