Corona Treatment: రూ.10 ఫీజుతో కరోనా వైద్యం.. పీర్జాదిగూడలో వైద్యుడు విక్టర్‌ ఇమ్మాన్యుయెల్ ఔదార్యం

క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో ఎలాంటి డ్యామేజ్ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలో ప్రవేట్ ఆస్ప‌త్రులు, ఫార్మా కంపెనీలు ప్ర‌జ‌లను చికిత్స పేరుతో...

Corona Treatment: రూ.10 ఫీజుతో కరోనా వైద్యం.. పీర్జాదిగూడలో వైద్యుడు విక్టర్‌ ఇమ్మాన్యుయెల్ ఔదార్యం
Rs 10 Corona Treatment
Follow us
Ram Naramaneni

|

Updated on: May 24, 2021 | 3:59 PM

క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో ఎలాంటి డ్యామేజ్ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలో ప్రవేట్ ఆస్ప‌త్రులు, ఫార్మా కంపెనీలు ప్ర‌జ‌లను చికిత్స పేరుతో దోపిడి చేస్తున్నాయి. ప్రాణాల‌కు మీద‌కు వ‌స్తుండ‌టంతో.. రోగులు ఆస్తులు అమ్మి మ‌రీ బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే కన్సల్టెన్సీ ఫీజుగా రూ. 10 తీసుకొని, కరోనా సోకిన‌వారికి చికిత్స అందిస్తున్నారో డాక్ట‌ర్. బాధితులు మరీ పేద‌వారు అయితే ఆ రూ. 10 కూడా తీసుకోవ‌డం లేదు. క‌రోనాకు సంబంధించిన వివిధ టెస్టుల‌ను కూడా త‌క్కువ ధ‌ర‌ల‌కే చేస్తున్నారు. మెడిసిన్ కూడా వీలైనంత తక్కువ ధ‌ర‌కే అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

హైద‌రాబాద్ పీర్జాదిగూడలో ప్రజ్వల క్లినిక్‌ నిర్వహిస్తూ.. ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్న‌ ఆ డాక్టర్ పేరు విక్టర్‌ ఇమ్మాన్యుయెల్. ఆయన జనరల్‌ మెడిసిన్‌ స్పెషలైజేషన్‌తో ఎంబీబీఎస్‌ చేశారు. వివిధ ఆస్పత్రుల్లో పనిచేసిన ఆయన తర్వాత సొంతంగా క్లినిక్‌ పెట్టుకున్నారు. క్లినిక్‌ పెట్టినప్పటి నుంచి కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.200 తీసుకుంటూ స‌ర్వీసు అందిస్తున్నారు. పేదవారు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో త‌న‌వ‌ద్ద‌కు వ‌స్తే మాత్రం రూ.10 మాత్రమే తీసుకుంటున్నారు. ప్రజలకు అన్నం పెట్టే రైతులు, దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికులు, అనాథలు, దివ్యాంగులకు ఫీజు సహా వ్యాధి నయం అయ్యే దాకా మందులతో సహా ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కొందరు దాతలు స‌హ‌కారం అందిస్తుండ‌టంతో నిరుపేద రోగులకు టెస్టులు సహా మెడిసిన్ కూడీ ఫ్రీగా అందిస్తున్నారు.

Also Read: తెలంగాణలోకి ఏ పాసులు ఉంటే అనుమ‌తి ఇస్తారు.. న‌ల్ల‌గొండ డిఐజి రంగ‌నాథ్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ వాతావరణ సమాచారం.. రాగల మూడు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..