AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రవల్లిక ఆత్మహత్య.. బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు

ప్రవల్లిక ఆత్మహత్యకు రద్దయిన టిఎస్పిఎస్సి గ్రూప్ ఎగ్జామ్స్ ఏ కారణం అంటూ ఆందోళన మొదలైంది. నిన్న రాత్రి వందలాదిమంది విద్యార్థులు నిరుద్యోగులు ప్రవళిక హాస్టల్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. మధ్యరాత్రి వరకు పరిస్థితి ఉధృతంగా మారింది. ఇక ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్య అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ధ్వజమెత్తింది. పలువురు కాంగ్రెస్ నేతలు..

Hyderabad: ప్రవల్లిక ఆత్మహత్య.. బీఆర్‌ఎస్‌పై  కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు
Pravallika Suicide Case
Sravan Kumar B
| Edited By: |

Updated on: Oct 14, 2023 | 8:17 PM

Share

Pravallika Suicide Case: అశోక్ నగర్‌లోని హాస్టల్లో వరంగల్‌కు చెందిన ప్రవళిక అనే యువతి శుక్రవారం సాయంత్రం 8:30 ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాను రాసిన సూసైడ్ లెటర్ లో తన కుటుంబానికి భారం కాదల్చుకోవట్లేదని, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, నన్ను క్షమించాలంటూ రాసింది. అయితే ప్రవల్లిక ఆత్మహత్యకు రద్దయిన టిఎస్పిఎస్సి గ్రూప్ ఎగ్జామ్స్ ఏ కారణం అంటూ ఆందోళన మొదలైంది. నిన్న రాత్రి వందలాదిమంది విద్యార్థులు నిరుద్యోగులు ప్రవళిక హాస్టల్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. మధ్యరాత్రి వరకు పరిస్థితి ఉధృతంగా మారింది. ఇక ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్య అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ధ్వజమెత్తింది. పలువురు కాంగ్రెస్ నేతలు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.

గురువారం జరిగినటువంటి సంఘటన నిరుద్యోగ యువతి ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య ఎందుకంటే తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ప్రభుత్వం వైఫల్యమే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గత తొమ్మిది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడంలో వైఫల్యం అయ్యిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన నోటిఫికేషన్లను టీఎస్పీఎస్ ద్వారా పరీక్షలు నిర్వహించడంలో కూడా విఫలమయ్యారు. పరీక్షల తేదీలను నిర్ణయిస్తూ పదేపదే వాయిదాలు వేస్తూ పెట్టిన పరీక్షలకు పేపర్ లీకులు చేస్తూ ఇలాగా అన్ని విషయాల్లో విఫలం చెందారు.

నిరుద్యోగ యువత యువకులు విద్యార్థులు తల్లిదండ్రులకు భారమై దూర ప్రాంతాల నుండి వచ్చి హైదరాబాద్ నగరంలో కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ప్రతిసారి పరీక్ష రాసి మళ్ళీ అవి రద్దు అయి మళ్ళీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ హాస్టల్లో ఉంటూ తల్లిదండ్రులకు భారమై పరీక్షలు వాయిదా పడడంతో మనస్థాపన గురవుతున్నారు ప్రవల్లిక ఆత్మహత్య కూడా ఇదే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదం తో తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు నియామకాల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని, ఈసారి ఎన్నికల్లో తెలంగాణ టిఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని కాంగ్రెస్ అంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ ప్రభుత్వానికి కాలేశ్వరం ప్రాజెక్టు మీద సెక్రటేరియట్ బిల్డింగ్ ల మీద ఉన్న శ్రద్ధ కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ నియామకాల మీద లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రజల బాగోగులను పట్టించుకోని ప్రభుత్వం మూడవసారి ఎలక్షన్లలో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని భుజాలు ఎగరేసుకుంటున్న కేసీఆర్‌, కేటీఆర్, హరీష్ రావు, కవిత వాళ్ల బాగున్న మాత్రమే చూసుకొని డబ్బులు దండుకోవడంలో మాత్రమే శ్రద్ధ పెట్టారని, ఇక ఈసారి ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఆటలు సాగవు అని అన్నారు.

ప్రవళిక ఆత్మహత్యపై ఏకంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ ట్విట్ చేయటంతో ఇప్పుడు ఈ అంశం సెన్సేషన్ గా మారింది. కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వ్యక్తిగత అంశం అని, ప్రేమ వైఫల్యమే ఆత్మహత్యకు కారణమని తమ విచారణలో తేలిందని అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి మరీ అడిగాడు..
ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి మరీ అడిగాడు..
ఐడియా అదిరింది గురూ.. 50ఏళ్లుగా గ్యాస్ లేకుండానే నడుస్తున్న హోటల్
ఐడియా అదిరింది గురూ.. 50ఏళ్లుగా గ్యాస్ లేకుండానే నడుస్తున్న హోటల్
మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే..
మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే..
ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలోనూ టాప్
ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలోనూ టాప్
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
వామ్మో.. పుట్టగొడుగులో ఆ భాగం తినకూడదా? కారణం తెలిస్తే..
వామ్మో.. పుట్టగొడుగులో ఆ భాగం తినకూడదా? కారణం తెలిస్తే..
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి
పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి
మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీమంత్రి కీలక వ్యాఖ్యలు
జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీమంత్రి కీలక వ్యాఖ్యలు