AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రవళిక ఆత్మహత్య.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ప్రయత్నించిన వారిపై కేసులు

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక కేసు కీలక మలుపు తిరిగింది. లవ్ ఇష్యూనే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. రాజకీయ పార్టీలు రంగంలోకి దిగడంతో ఈ ఘటన మరింత సెన్సిటివ్ అయ్యింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని తేల్చారు.

ప్రవళిక ఆత్మహత్య.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ప్రయత్నించిన వారిపై కేసులు
DCP Venkateswarlu
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Oct 14, 2023 | 9:15 PM

Share

హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో ప్రవళిక అనుమానాస్పద మరణం సంచలనం రేపింది. సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ను బట్టీ ఆత్మహత్యగా ప్రాథమిక నిర్దారణకు వచ్చారు పోలీసులు. పోస్ట్‌మార్టమ్‌ తరువాత డెడ్‌బాడీని ప్రవళిక పేరెంట్స్‌కు అప్పగించారు. షాకింగ్‌ వార్త విని పల్లె కన్నీరైంది. స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కోజిపల్లిలో శోకసంద్రమైంది..బాధతప్త హృదయాలతో ప్రవళిక అంత్యక్రియలు నిర్వహించారు బంధుమిత్రులు, స్థానికులు. గ్రూప్‌ 1, 2 పోటీపరీక్షలు వాయిదా వేయడం వల్లే మనస్తాపంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. పర్సనల్‌ ఇష్యూస్‌ వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. హాస్టల్‌ రూమ్‌లో స్వాదీనం చేసుకున్న సూసైడ్‌ నోట్‌ ఆధారంగా శివరాం రాథోడ్‌పై కేసు నమోదు చేశారు. పెళ్లి విషయంలో ఆ ఇద్దరి మధ్య వివాదం వున్నట్టు గుర్తించారు పోలీసులు. తనకు మాటచ్చి మరోయువతితో శివరాం ఎంగేజ్మెంట్‌ చేసుకోవడం వల్లే ప్రవళిక ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుందన్నారు హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు. పక్కా ఎవిడెన్స్‌తో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోటీపరీక్షల వాయిదాకు ప్రవళిక ఆత్మహత్యకు ఎలాంటి సంబంధంలేని క్లియర్‌ కట్‌ క్లారిటీ ఇచ్చారు డీసీపీ.

కొందరు ప్రవళిక సూసైడ్‌ను అదునుగా చేసుకొని ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించి గవర్నమెంట్ ఆస్తులు డ్యామేజ్ చేయడం, రాళ్లు రువ్వడం చేశారని..  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారని.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే అభ్యర్థిని సూసైడ్ చేసుకుందని తోటి విద్యార్థులు చెప్పినా పట్టించుకోకుండా కొందరు ఆందోళనకు దిగారని ఆయన వెల్లడించారు.

ప్రవళిక ఆత్మహత్య కేసులో అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు. అపోహాలను నమ్మోద్దని సూచించారు డీసీపీ వెంకటేశ్వర్లు.. మరోవైపు ప్రవళిక అర్ధాంతర మరణం ఆమె కుటుంబంలో తీరాన్ని శోకాన్ని మిగిల్చింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు బిక్కోజిపల్లి గ్రామస్తులు. ప్రవళిక మరణానికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.