AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bathukamma: పూలను పూజించే బతుకమ్మ సంబరాలతో హోరెత్తిన తెలంగాణ.. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సందడి

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ పండుగ.. దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రకృతిలో సూర్యచంద్రులను కొలిచిన విధంగానే వివిధ రకాల పూలను కొలిచే పండుగ ఇది. ప్రకృతిని ప్రేమించడం, పూజించడమే బతుకమ్మ. పచ్చదనంతో మమేకమై బతకాలని చల్లగా ఆశీర్వదించే పండుగ ఇది. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆటాపాటాతో ఓరుగల్లు ఝల్లుమంది.

Bathukamma: పూలను పూజించే బతుకమ్మ సంబరాలతో హోరెత్తిన తెలంగాణ.. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సందడి
Batumakamma Festival
Surya Kala
|

Updated on: Oct 15, 2023 | 6:46 AM

Share

ప్రకృతిని ప్రేమించడం, పూజించడమే బతుకమ్మ. పచ్చదనంతో మమేకమై బతకాలని చల్లగా ఆశీర్వదించే పండుగ ఇది. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆటాపాటాతో తెలంగాణలోని పల్లె నుంచి పట్టణం వరకు  ఝల్లుమంది. బతుకమ్మ సంబరాలను అంబరం తాకేలా మొదలు పెట్టింది.

ప్రకృతితో మమేకమై ఆడి పాడడమే బతుకమ్మ. పూలతో ప్రకృతిని పూజించడమే బతుకమ్మ పండుగ. బతుకమ్మ సంబరాలు వరంగల్‌లో అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఒక్కేసి పువ్వేసి అంటూ బతుకమ్మ ఆడతారు ఆడబిడ్డలు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సందడితో ఓరుగల్లు హోరెత్తిపోయింది. హనుమకొండ లోని వేయిస్తంభాల గుడి, వరంగల్‌లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఓ రేంజ్‌లో జరిగాయి. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని బతుకమ్మ చాటిచెబుతుంది. బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల పండుగ. దసరా ఉత్సవాలతో సమానంగా మహిళలు వైభవంగా నిర్వహించే వేడుక. దేశంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే పండుగ ఇది.

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ పండుగ.. దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రకృతిలో సూర్యచంద్రులను కొలిచిన విధంగానే వివిధ రకాల పూలను కొలిచే పండుగ ఇది. తీరొక్క రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను చేసి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ మహిళలు బతుకమ్మ ఆడుతారు. ఆడబిడ్డలను ఇళ్లకు ఆహ్వానించి కుటుంబమంతా సంబరాలు చేసుకుంటారు.

ఇవి కూడా చదవండి

లాలాపేట్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.. లాలాపేట్ పోచమ్మ దేవాలయం ప్రాంగణంలో స్థానిక మహిళలు, చిన్నారులు బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అత్యంత సంతోషంగా బతుకమ్మ ఆడుతూ సంతోషంగా వేడుకలు జరుపుకున్నారు. వందలాది మంది మహిళలు చిన్నారులు యువతులు బతుకమ్మలను తయారు చేసుకొని బతుకమ్మ ఆడి బతుకమ్మలను నీళ్లలో నిమజ్జనం చేశారు.

బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. కుల, మత, వర్గ, వృత్తి, ప్రాంత సంప్రదాయాలకు అతీతంగా బతుకమ్మ వేడుక నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది తెలంగాణ. ప్రకృతిలో లభించే అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడుతారు. గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అంతరిక్షంలోకి ఇస్రో 'అన్వేషణ'.. 2026లో తొలి ప్రయోగానికి మొదలైన
అంతరిక్షంలోకి ఇస్రో 'అన్వేషణ'.. 2026లో తొలి ప్రయోగానికి మొదలైన
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..