Telangana: చలికాలంలో మండుతున్న 'వేసవి'.. మరో వారం రోజులు భగభగలే!

Telangana: చలికాలంలో మండుతున్న ‘వేసవి’.. మరో వారం రోజులు భగభగలే!

Ravi Kiran

|

Updated on: Oct 14, 2023 | 9:03 PM

తెలంగాణలో ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. వింటర్‌లోనే భానుడు భగభగమంటున్నాడు. చలికాలంలో క్రమంగా తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి సీజన్‌ ముగిసి , ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలిస్తుంటాయి. ఈశాన్య రుతుపవనాలు ఇంకా ప్రవేశించనప్పటికీ సాధారణంగా ఈ పాటికి వాతావరణం చల్లబడుతుంది. కానీ, రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.

తెలంగాణలో ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. వింటర్‌లోనే భానుడు భగభగమంటున్నాడు. చలికాలంలో క్రమంగా తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి సీజన్‌ ముగిసి , ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలిస్తుంటాయి. ఈశాన్య రుతుపవనాలు ఇంకా ప్రవేశించనప్పటికీ సాధారణంగా ఈ పాటికి వాతావరణం చల్లబడుతుంది. కానీ, రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ వరకు అధికంగా నమోదు అవుతూ, వేసవిని తలపిస్తున్నాయి. వాతావరణంలో తేమ తగ్గడంతో ఉక్కపోత పెరుగుతోంది. ఆకాశం నిర్మలంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నైరుతి తిరోగమన ప్రక్రియ చివరి దశలో ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి రుతుపవనాలు పూర్తిస్థాయిలో తిరోగమించాయి. శుక్రవారం నల్లగొండ వరకు చేరినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత వారం రోజులకు ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించవచ్చని అంచనా వేసింది. ఈ క్రమంలో వాతావరణంలో మార్పు లు ఉంటాయని, దీంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావచ్చని పేర్కొంది. రానున్న మూడు రోజులు రాష్ట్రం లో పొడి వాతావరణమే ఉంటుందని, మరో వారం రోజులుపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది.

Published on: Oct 14, 2023 08:47 PM