Hyderabad: ప్రవల్లిక ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. అదే కారణమంటున్న పోలీసులు..!
Pravallika Suicide Case: గ్రూప్-2 అభ్యర్ధి ప్రవల్లిక ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రవల్లిక ఆత్మహత్య కేసును చేధించిన పోలీసులు.. ప్రేమ పేరుతో బాయ్ ఫ్రెండ్ మోసం చేయడంతోనే ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా గుర్తించారు. ప్రవల్లిక ఘటనను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై..

హైదరాబాద్, అక్టోబర్ 14: గ్రూప్-2 అభ్యర్ధి ప్రవల్లిక ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రవల్లిక ఆత్మహత్య కేసును చేధించిన పోలీసులు.. ప్రేమ పేరుతో బాయ్ ఫ్రెండ్ మోసం చేయడంతోనే ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా గుర్తించారు. ప్రవల్లిక సూసైడ్ వెనుక డీఎస్సీ, గ్రూప్-2 వాయిదా కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. శివరాం అనే వ్యక్తితో ప్రవల్లిక ప్రేమలో పడింది. అతడితో జరిపిన చాటింగ్‌ను పరిశీలించి.. బాయ్ ఫ్రెండ్‌తో మనస్పర్థలు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు సెంట్రల్ జోన్ డీసీపీ చెప్పారు.
ఆత్మహత్య కంటే ముందు కూడా శివరాంతో ప్రవల్లిక కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు చెప్పారు. అతడితో నిన్న విభేదాలు తలెత్తిన తర్వాత తీవ్రంగా మనస్తాపం చెంది హాస్టల్ రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆత్మహత్య కంటే ముందు ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపారు. శివరామ్‌కు ఇటీవల మరో యువతితో నిశ్చితార్ధం జరిగింది. ఆ మనస్తాపంతోనే ప్రవల్లిక సూసైడ్ చేసుకుంది అని క్లారిటీ ఇచ్చారు. అమ్మాయి సూసైడ్ నోట్, ఫోన్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపామని పోలీసులు చెప్పారు. FSL నివేదిక తర్వాతే శివరాంపై కేసు నమోదు చేస్తామని తెలిపారు పోలీసులు.
మరోవైపు ఆత్మహత్య ఘటనను అడ్డుపెట్టుకుని ఆందోళన నిర్వహించిన వారిపై చర్యలు ఉంటాయని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. ప్రవల్లిక ఆత్మహత్య తర్వాత బాయ్ ఫ్రెండ్ శివరాం పరారి అయినట్టు.. త్వరలోనే అతడ్ని అదుపులోకి తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. ఆందోళనలో పాల్గొన్న రాజకీయ నాయకులపై కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు సెంట్రల్ జోన్ డీసీపీ.
ప్రవల్లిక ఘటనపై గవర్నర్ తమిళసై ఏమన్నారంటే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
