Telangana: కాంగ్రెస్‌లో కొలిక్కిరాని ‘టికెట్ల’ పంచాయితీ.. ఆశావాహుల్లో టెన్షన్‌.. టెన్షన్.!

వీలైనంత త్వరగా కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితా విడుదల చేస్తామంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్ రావ్ ఠాక్రే. ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదాయన. ‘సీఈసీ సమావేశానికి ముందు మరోమారు స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుంది. వీలైనంత త్వరగా జాబితా సిద్ధం చేస్తామన్నారు. అతి త్వరలో తొలి జాబితాను విడుదల చేస్తాం అన్నారు ఠాక్రే.

Telangana: కాంగ్రెస్‌లో కొలిక్కిరాని 'టికెట్ల' పంచాయితీ.. ఆశావాహుల్లో టెన్షన్‌.. టెన్షన్.!
Congress Party
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 09, 2023 | 7:42 AM

హైదరాబాద్, అక్టోబర్ 9: వీలైనంత త్వరగా కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితా విడుదల చేస్తామంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్ రావ్ ఠాక్రే. ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదాయన. ‘సీఈసీ సమావేశానికి ముందు మరోమారు స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుంది. వీలైనంత త్వరగా జాబితా సిద్ధం చేస్తామన్నారు. అతి త్వరలో తొలి జాబితాను విడుదల చేస్తాం. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ జాబితాను ఖరారు చేస్తుందన్నారు. బిసిలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తాం.. వివిధ సామాజికవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నుంచి ఒక జాబితా వచ్చింది. అన్ని వైపుల నుంచి వచ్చిన దరఖాస్తులను మేము పరిశీలించాం. అన్నివర్గాలకు తగినంత ప్రాతినిథ్యం లభించేలా చూస్తున్నాం. టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీదే’ అని తెలిపారు మాణిక్‌రావు ఠాక్రే. ఇదిలా ఉంటే.. ఈలోగా టికెట్లు ఆశిస్తున్నవారు ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ నేడో రేపో ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతున్నా.. కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా మాత్రం ఇంకా తయారుకాలేదు. దీంతో ఆశావాహుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. నేరుగా అధిష్టానంతోనే తేల్చుకునేందుకు ఢిల్లీ బాట పట్టారు. కాంగ్రెస్‌ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న కాంగ్రెస్ వార్ రూమ్ ఎదుట ఓయూ జేఏసీ నేతలు ధర్నా చేపట్టారు. కనీసం 5 సీట్లైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కోసం త్యాగం చేసిన వారిని కాదని, కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి టికెట్లు ఇస్తున్నారని ఓయూ జేఏసీ నేతలు వాపోయారు. ఓయూ జేఏసీ నేతల ధర్నాతో కాంగ్రెస్‌ పెద్దలు కదిలారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని మాటిచ్చారు. అటు అన్ని స్థానాల అభ్యర్థులపై చర్చ జరిగిందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఈసీ నిర్ణయం మేరకు అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామన్నారు. వారంలోగా జాబితా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు ఎంపీ కోమటిరెడ్డి.

సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని ఓబీసీ నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కనీసం 35 సీట్లు ఇవ్వాలంటూ వినతి పత్రాలు అందజేశారు. సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కమ్మ సామాజిక వర్గ నేతలు కూడా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. మహిళా కాంగ్రెస్‌ నేతలు కూడా తమకు కనీసం 25 టిక్కెట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ తరుణంలో టికెట్ల కేటాయింపు కాంగ్రెస్‌ అధిష్టానానికి సవాలుగా మారింది. అటు ఢిల్లీలో కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో తెలంగాణ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం వాడివేడిగా జరిగింది. అభ్యర్ధుల ఎంపికపై 8 గంటల పాటు సమావేశంలో చర్చించారు. అతి త్వరలో తొలి జాబితాను విడుదల చేస్తామని, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ జాబితాను ఖరారు చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్ రావ్ ఠాక్రే చెప్పారు. ఇన్ని డిమాండ్ల మధ్య అందరికీ తగిన చోటు కల్పిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే