Hyderabad: మంచి హోటల్, నోరూరించే మెనూ.. లోపల కిచెన్‌లోకి వెళ్తే..
మంచి హోటల్, నోరూరించే మెనూ, కంటికి ఇంపైన ఐటమ్స్ చూసి టెంప్ట్ అవుతున్నారా..? బీ కేర్ ఫుల్...! ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుళ్లిన కూరగాయలు, ఆకుకూరలు..ఫుడ్‌లో సింథటిక్ కలర్స్.. ఇది హోటళ్ల బాగోతం. పలు చోట్ల కాలంచెల్లిన ప్రొడక్ట్ వాడుతున్నట్టు గుర్తించారు అధికారులు.

హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా.. కొందరు కేటుగాళ్ల తీరు ఏమాత్రం మారడం లేదు. ఆహార తయారీలో ఇష్టారీతి పదార్థాలు, డేంజర్ కెమికల్స్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు. కేసులు నమోదు అవుతున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా అవేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ఆహార పదార్థాల కల్తీ.. తయారీలో డేంజర్ కెమికల్స్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తూనే ఉన్నారు.
తాజాగా.. లక్డీకపూల్, నారాయణగూడలో హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి చేశారు. ఫుడ్ ఐటమ్స్‌లో హానికరమైన సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. తుప్పుపట్టిన పాత్రల్లో ఆహార పదార్థాలు తయారుచేస్తున్నట్లు తేల్చారు. ఒకే ఫ్రిడ్జ్‌లో వెజ్, నాన్ వెజ్‌ను నిల్వ చేస్తుండడపై సీరియస్ అయ్యారు. అంతేకాదు కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణం, బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. ఎక్స్‌పైరీ అయిన ఫుడ్ ప్రొడక్స్‌ని వాడుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ… హోటల్ అశోక్, ఇండియన్ దర్బార్ సహా పలు రెస్టారెంట్లకు నోటీసులిచ్చారు.
𝗛𝗼𝘁𝗲𝗹 𝗔𝘀𝗵𝗼𝗸𝗮, 𝗟𝗮𝗸𝗱𝗶𝗸𝗮𝗽𝘂𝗹03.02.2025
* Kitchen walls and floor were found to be untidy. Foul smell observed.
* Cockroach infestation was observed in the kitchen.
* Vessels in kitchen and refrigerator were found to be rusty.
* Synthetic food colours was… pic.twitter.com/SNCZ3G0WKE
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) February 3, 2025
అలాగే FSSAI నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్ధాలను విక్రయిస్తున్న హోటల్స్‌ను సీజ్ చేశారు. ఫుడ్ ఐటమ్స్‌లో కెమికల్స్ వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మొత్తంగా.. హైదరాబాద్‌లో వరుస ఫుడ్ సేఫ్టీ దాడులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారి గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి.
Task force team has conducted inspections in Narayanaguda area on 03.02.2025.
𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗗𝘂𝗿𝗯𝗮𝗿 𝗥𝗲𝘀𝘁𝗮𝘂𝗿𝗮𝗻𝘁, 𝗡𝗮𝗿𝗮𝘆𝗮𝗻𝗮𝗴𝘂𝗱𝗮
* Food handlers were found without aprons in kitchen area.
* Boiled eggs were found placed near drains without any covering.… pic.twitter.com/Z9KnuCVHm4
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) February 3, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..