Hyderabad: సైబర్ కేటుగాళ్ల వలలో చర్లపల్లి జైలు డిప్యూటి సూపరింటెండెంట్.. ఆ వీడియోల పేరుతో బ్లాక్‌మెయిల్.. 

సైబర్ నేరస్థులు ఎవర్నీ వదలడం లేదు.. సామాన్యులతోపాటు.. అధికారులను కూడా టార్గెట్ చేస్తున్నారు. మోసపోయేవారిలో పోలీస్‌ అధికారులు కూడా ఉంటుండటం గమనార్హం..

Hyderabad: సైబర్ కేటుగాళ్ల వలలో చర్లపల్లి జైలు డిప్యూటి సూపరింటెండెంట్.. ఆ వీడియోల పేరుతో బ్లాక్‌మెయిల్.. 
Cybercrime
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 15, 2022 | 6:25 PM

సైబర్ నేరస్థులు ఎవర్నీ వదలడం లేదు.. సామాన్యులతోపాటు.. అధికారులను కూడా టార్గెట్ చేస్తున్నారు. మోసపోయేవారిలో పోలీస్‌ అధికారులు కూడా ఉంటుండటం గమనార్హం.. తాజాగా.. సైబర్‌ చీటర్స్‌ రెచ్చిపోయారు. చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ నుంచి కూడా సైబర్‌ నేరగాళ్లు బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేశారు. చర్లపల్లి జైల్ డిప్యూటి సూపరింటెండెంట్ దశరథం నుంచి లక్ష రూపాయలు వసూల్ చేశారు సైబర్ కేటుగాళ్ళు. మీ వ్యక్తిగత వీడియోలు యూట్యూబ్‌లో వైరల్ చెయ్యకుండా ఉండాలంటే డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటూ ఆయన్ను బెదిరించారు.

దీంతో భయపడిన దశరథం.. సైబర్ గ్యాంగ్ డిమాండ్‌కు అంగీకరించారు. సైబర్ నేరస్థులకు మొదట 35 వేలు గూగుల్ పే చేశాడు దశరథం. ఆ తర్వాత మరో 65 వేలు కూడా ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అయినా వదలని కేటుగాళ్ళు పదే పదే ఫోన్లు చేసి మళ్ళీ 85000 వేలు కావాలని బెదిరింపులకు దిగారు.

దీంతో చర్లపల్లి జైల్ డిప్యూటి సూపరింటెండెంట్ దశరథం కూషాయిగుడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన నుంచి రూ. లక్ష వరకు వసూలు చేశారని.. ఇంకా కావాలని వేధిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. కాగా.. సైబర్ నేరస్థులు పెద్ద స్థాయి పోలీసు అధికారి నుంచి డబ్బులు తీసుకోవడం.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్