Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌.. పలువురికి తీవ్ర గాయాలు

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పి ప్లాట్‌ ఫాడ్ సైడ్‌ వాల్‌ను ఢీ కొట్టడంతో సుమారు 50 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రమాదంలో మూడు ఎక్స్‌ప్రెస్‌ బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ సంఘటన గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన  చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌.. పలువురికి తీవ్ర గాయాలు
Charminar Express
Follow us
Basha Shek

|

Updated on: Jan 10, 2024 | 10:56 AM

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పి ప్లాట్‌ ఫాడ్ సైడ్‌ వాల్‌ను ఢీ కొట్టడంతో సుమారు 50 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రమాదంలో మూడు ఎక్స్‌ప్రెస్‌ బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  ప్లాట్‌ఫాంపైకి చేరుకునే క్రమంలో సైడ్‌ వాల్‌ను ఢీకొట్టి రైలు పట్టాలు తప్పినట్లు సమాచారం.  ఒక్కసారి రైలు కుదుపునకు గురికావడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తోన్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పంది. డెడ్ ఎండ్ లైన్ ప్రహరీకి తాకడంతో మూడు ఎక్స్ ప్రస్ బోగాలు పట్టాలు తప్పాయి.  అయితే అప్పటికే పలువురు ప్రయాణికులు కిందకు దిగారు. పైగా నాంపల్లి రైల్వే స్టేషన్ చివరిది కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటలనో కొంత మందికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి.

‘ చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రమాదానికి గురైంది. డెడ్‌ఎండ్ గోడను ఢీకొనడంతో మూడు బోగిలు S2, S3, S6 పక్కకు ఒరిగాయి. ప్రమాద సమయంలో ట్రైన్‌ చాలా తక్కువ స్పీడ్‌తో ఉన్న కారణంగా పెద్ద ప్రమాదమే తప్పింది. దిగడానికి సిద్ధంగా ఉన్న వారు గాయపడ్డారు. వారిని లాలాగూడ ఆస్పత్రికి తరలించారు. వారు పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్‌లోనే చికిత్స అందిస్తాం’ అని దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేశ్ తెలిపారు. ప్రమాద అనంతరం అక్కడ సహాయక చర్యలు, మరమ్మతులు కొనసాగుతున్నాయి. రైల్వే సిబ్బంది రెస్స్యూ ఆపరేషన్ చేపట్టారు. అది ప్రమాదమా? నిర్లక్ష్యమా? ట్రైన్‌ డెడ్‌ ఎండ్‌ వాల్‌ను ఢీకొట్టడంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..