Hyderabad: తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన బ్యాంక్ ఉద్యోగికి 5 ఏళ్లు జైలు శిక్ష.. ఇంతకీ ఏం చేశాడనేగా..
ఈ కేసుకు సంబంధించి గతంలో సీబై అధికారులకు బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీబీఐ అధికారులు అప్పటి బ్యాంక్ మేనేజర్ ఏ. గధాదర్‌తో పాటు పండింటి రాజశేఖర్, గడ్డిగోపుల సత్యానంద రావ్‌లపై కేసు నమోదు చేసిన అధికారులు వారిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ స్సెషల్ జడ్జి ఈ కేసుపై తీర్పు ప్రకటించారు. ఇంతకీ ఈ తీర్పులో జడ్జి ఏం తెలిపారంటే..

సరూర్‌నగర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజర్ ఏ.గదాధర్‌కు సీబీఐ కోర్టు శిక్ష విధించింది. నిబంధనలకు విరుద్ధంగా గంగాధర్ బ్యాంకు మేనేజర్ గా ఉన్న సమయంలో హోమ్ లోన్ ఇప్పించారంటూ ఆరోపణలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొత్తం 73.80 లక్షల రూపాయలు నష్టం చేకూర్చినందుకు ఆయనకు కోర్టు శిక్ష విధించింది.
ఈ కేసుకు సంబంధించి గతంలో సీబై అధికారులకు బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీబీఐ అధికారులు అప్పటి బ్యాంక్ మేనేజర్ ఏ. గధాదర్‌తో పాటు పండింటి రాజశేఖర్, గడ్డిగోపుల సత్యానంద రావ్‌లపై కేసు నమోదు చేసిన అధికారులు వారిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ స్సెషల్ జడ్జి ఈ కేసుపై తీర్పు ప్రకటించారు. ఇంతకీ ఈ తీర్పులో జడ్జి ఏం తెలిపారంటే..
అప్పటి బ్యాంకు మేనేజర్ గంగాధర్‌తో పాటు రాజశేఖర్, సత్యానంద్‌లకు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు ప్రకటించింది. వీరిలో బ్యాంక్ మేనేజర్ గదాధర్‌కు 5 సంవత్సరాల శిక్ష విధించడంతోపాటు 60 వేల రూపాయల జరిమానా విధించింది . ఇక మరో ఇద్దరు నిందితులు రాజశేఖర్ తో పాటు సత్యానందరావుకు ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు పదివేల రూపాయల చెల్లించాలని సీబీఐ స్పెషల్ జడ్జ్ ఆదేశించారు. ఈ అంశం పై సీబీఐ ప్రెస్ రిలీజ్ చేసింది. బ్యాంకుకు వెళ్లిన పలువురు కస్టమర్లతో కుమ్మక్కై మేనేజర్‌గా ఉన్న గదాధర్ నిబంధనలకు విరుద్ధంగా హోం లోన్ ప్రాసెస్ చేసి సాంక్షన్ చేశారు.
లోన్ తీసుకున్న అకౌంట్లు అన్ని NPA (నాన్ పర్ఫామింగ్ అసెస్ట్స్) గా అధికారులు గుర్తించారు. బ్యాంకు ఉద్యోగులు చేసిన ఈ పనివల్ల బ్యాంక్ ఆఫ్ ఇండియా సరూర్ నగర్ బ్రాంచ్‌కు ఏకంగా రూ. 73.8 లక్షల నష్టం వాటిల్లింది. దీంతో కేసును స్వీకరించిన సీబీఐ అధికారులు విచారణ చేపట్టి నిందుతులను అరెస్ట్ చేశారు. తాజాగా సీబీఐ స్పెషల్ జడ్జ్ నిందితులకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..